కౌంటరు దాఖలులో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీఎస్‌ఐఐసీకి చెందిన 31.35 ఎకరాల భూమి కేటాయింపులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రెండేళ్లుగా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు

Published : 28 Jan 2022 04:37 IST

రాయదుర్గంలో భూ కేటాయింపుల వ్యవహారం..

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీఎస్‌ఐఐసీకి చెందిన 31.35 ఎకరాల భూమి కేటాయింపులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రెండేళ్లుగా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 6 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ భూమి కేటాయింపులను సవాలు చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి 2020 ఫిబ్రవరిలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. డీఎల్‌ఎఫ్‌ కొనుగోలు చేసిన భూములు అక్రమంగా మైహోం గ్రూపునకు చెందిన కంపెనీకి వెళ్లాయని ఆరోపించారు.  ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసులో ప్రతివాదిగా ఉన్న ఆక్వా స్పేస్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కౌంటరు దాఖలు చేసింది. ఆ భూమిని రూ.580.50 కోట్లకు బిడ్‌లో దక్కించుకోవడంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందలేదని, చట్టప్రకారమే కొనుగోలు చేశామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు