వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా

కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్‌ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది.

Published : 27 Mar 2024 00:06 IST

కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్‌ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. వరదలను కచ్చితంగా అంచనా వేసే ఫ్లడ్‌ హబ్‌ టూల్‌ను రూపొందించింది. ఏడు రోజుల ముందే నదులకు వరదలు వచ్చే అవకాశాన్ని పసిగట్టటం దీని ప్రత్యేకత. మట్టి తీరు, వాతావరణ అంచనాల వంటి అందుబాటులో ఉన్న భూభౌతిక, వాతావరణ సమాచారం ఆధారంగా ఈ టూల్‌ పనిచేస్తుంది. ప్రాథమికంగా మనదేశంలోనే పరీక్షించినా ఇప్పుడు 80కి పైగా దేశాలకు దీన్ని విస్తరించారు. ఇది 1800కు పైగా ప్రాంతాల్లో వరదలను అంచనా వేయగలదని, 46 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చగలదని గూగుల్‌ చెబుతోంది. గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌, ఆండ్రాయిడ్‌ అలర్ట్స్‌ వంటి గూగుల్‌ వేదికల ద్వారా ఇది యూజర్లకు వరదలకు సంబంధించిన నోటిఫికేషన్లు అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

ఫ్లడ్‌ హబ్‌ టూల్‌ రెండు కీలక నమూనాల ద్వారా వరదలను అంచనా వేస్తుంది. ఒకటి- హైడ్రోలాజిక్‌ మోడల్‌. భాష్పీకరణ, నదీ తీర పరిస్థితుల వంటి సమాచారాన్ని విశ్లేషించి, నీటి మట్టాలను పసిగడుతుంది. రెండోది- ఇనండేషన్‌ మోడల్‌. ఇదేమో హైడ్రోలాజిక్‌ మోడల్‌, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నీటి కదలికలను సిమ్యులేట్‌ చేస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశముంటే తెలియజేస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని