Published : 12/11/2021 09:33 IST

WhatsApp Disappearing: వాట్సాప్ డిస్‌అప్పియరింగ్..త్వరలో 24 గంటలు, 90 రోజుల్లో మాయమవుతాయి

ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌ వరుసగా కొత్త పీచర్లను తీసుకొస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మల్టీడివైజ్‌, పేమెంట్, ఎమోజీ రిప్లై వంటి కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అంతేకాకుండా వాట్సాప్ ప్లేయర్, ఆడియో మెసేజ్‌ ప్రివ్యూ, కమ్యూనిటీ వంటి మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. అయితే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన తర్వాత దానికి అదనపు మెరుగులు దిద్దడం వాట్సాప్‌కు అలవాటు. తాజాగా డిస్‌అప్పియరింగ్‌ ఫీచర్‌ను మరింత మెరుగుపరచనున్నట్లు సమాచారం. వాట్సాప్‌ గతేడాదే ఈ ఫీచర్స్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ద్వారా మెసేజ్‌ పంపిన తర్వాత ఏడు రోజుల్లో వాటంతటవే డిలీట్ అయిపోతాయి. ఈ ప్రక్రియ జరిగేందుకు యూజర్‌ వాట్సాప్‌ ఇన్ఫోలోకి వెళ్లి డిస్‌అప్పిరియంగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి.

త్వరలోనే ఈ ఫీచర్‌లో ఏడు రోజుల ఆప్షన్‌తోపాటు 24 గంటలు, 90 రోజుల ఆప్షన్స్‌ని అదనంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అంటే డిస్‌అప్పియరింగ్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసిన వెంటనే ఎన్ని రోజులకు డిలీట్‌ అవ్వాలి అని అడుగుతుందట. అందులో 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సింది ఎంచుకుంటే సరి. అక్కడ 24 గంటలు ఎంచుకుంటే, ఒక రోజులో మెసేజ్‌లు మాయమవుతాయి. అలాకాకుండా 90 రోజులు ఎంచుకుంటే, మూడు నెలల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవుతాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను బీటా యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో అందరికీ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇవేకాకుండా వాట్సాప్ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో కూడా మార్పులు చేయనుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో(వాబీటాఇన్ఫో) తెలిపింది. ఇప్పటికే పలువురు బీటా యూజర్స్‌కి ఈ కొత్త యూఐ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవలే వాట్సాప్ డిలీట్ మెసేజ్‌ టైమ్ లిమిట్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అంటే ప్రస్తుతం ఉన్న గంట, 8 నిమిషాలు, 16 సెకన్లతోపాటు కొత్తగా నెల రోజుల తర్వాత కూడా మనతోపాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సదుపాయాన్ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది.

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని