కొత్తగా 3,603 కేసులు.. ఒకరి మృతి

రాష్ట్రంలో మరో 3,603 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,34,815కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూశారు. ఇప్పటి వరకూ 4,072 మంది మృతిచెందారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన

Published : 24 Jan 2022 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 3,603 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,34,815కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూశారు. ఇప్పటి వరకూ 4,072 మంది మృతిచెందారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు టి.భానుప్రసాద్‌రావుకు పాజిటివ్‌గా తేలింది. నల్గొండ మున్సిపాలిటీలో కమిషనర్‌ రమణాచారితోపాటు పది మందికిపైగా అధికారులకు, సిబ్బందికి కొవిడ్‌ సోకింది.

పరీక్షించిన నమూనాలు 93,397

రాష్ట్రంలో 32,094 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. తాజాగా 2,707 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తంగా 6,98,649 మంది కోలుకున్నారు. ఈనెల 23 వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,421 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 308, రంగారెడ్డిలో 262, హనుమకొండలో 150, కరీంనగర్‌లో 98, మహబూబ్‌నగర్‌లో 96, సంగారెడ్డిలో 93, ఖమ్మంలో 92, నల్గొండలో 83, సిద్దిపేటలో 75, నిజామాబాద్‌లో 72, వరంగల్‌లో 71, మంచిర్యాలలో 68, పెద్దపల్లిలో 67, భద్రాద్రి కొత్తగూడెంలో 56 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ సంఖ్యలో  కేసులు నమోదయ్యాయి.

ఇంటింటి జ్వర సర్వే ఆదివారం కూడా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 13,04,227 కుటుంబాలను వైద్యసిబ్బంది పరిశీలించారు. ఇందులో 50,807 మందికి హోం ఐసొలేషన్‌ కిట్లను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని