ఎమ్మార్పీఎస్‌ ఉద్యమంతోమానవహక్కుల దండోరా: మందకృష్ణ

దళితుల వర్గీకరణం కోసం మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి గత 27 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఉద్యమం మానవ హక్కుల దండోరాగా గుర్తింపు పొందిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక

Published : 25 Nov 2021 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: దళితుల వర్గీకరణం కోసం మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి గత 27 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఉద్యమం మానవ హక్కుల దండోరాగా గుర్తింపు పొందిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రచయిత, విమర్శకుడు డప్పోల్ల రమేశ్‌ సంపాదకత్వంలో వెలువడిన అక్షర దండోరా పుస్తకాన్ని మందకృష్ణ బుధవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత రమేశ్‌, ప్రొఫెసర్‌ ముత్తయ్య, ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకులు రాజు, ఎల్లయ్య, సూరన్న, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ ఉద్యమ చరిత్ర మూలాలు, మాదిగ ఉప కులాల ఆకాంక్ష, అవేదనను రచయిత పుస్తకంలో కళ్లకుకట్టారని తెలిపారు. తక్షణమే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి అమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు