ఏపీలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లోనే..

దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా

Updated : 28 Nov 2021 05:02 IST

చంద్రబాబు నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెదేపా ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. ‘కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం నిలవడం జగన్‌ రైతు వ్యతిరేక చర్యలకు అద్దం పడుతోంది. ఈ అంశాలపై లోక్‌సభలో పోరాటం చేయాలి’ అని సూచించారు. సమావేశంలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, పార్టీ జాతీయ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్‌, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని