కర్ణాటకలో సీఎం పదవికి 2,500 కోట్లు అడుగుతున్నారట!

‘‘కర్ణాటకలో సీఎం పదవి కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారని భాజపా ఎమ్మెల్యే చెబుతున్నారు. 40 శాతం కమీషన్‌ ఇవ్వాలని గుత్తేదారులు అంటున్నారు. 30 శాతం కమీషన్‌ ఇవ్వాలని హిందూ మఠంవాళ్లు అడుగుతున్నారు.

Published : 08 May 2022 05:35 IST

దీనిపై ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలున్నాయా?
నడ్డాకు ట్విటర్‌లో కేటీఆర్‌ ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘కర్ణాటకలో సీఎం పదవి కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారని భాజపా ఎమ్మెల్యే చెబుతున్నారు. 40 శాతం కమీషన్‌ ఇవ్వాలని గుత్తేదారులు అంటున్నారు. 30 శాతం కమీషన్‌ ఇవ్వాలని హిందూ మఠంవాళ్లు అడుగుతున్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారు. వీటిపై ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా’’ అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా జేపీ నడ్డా ఉన్న సమయంలో ఎయిమ్స్‌లో రూ.7 వేల కోట్ల కుంభకోణాలు జరిగాయనే ఆరోపణలపై జాతీయ మీడియాలో వచ్చిన వార్తను కూడా ట్యాగ్‌ చేసిన కేటీఆర్‌.. ‘రాజా హరిశ్చంద్ర ఫస్ట్‌ కజిన్‌’కు రూ.7 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.50 పెరగడాన్ని ప్రస్తావిస్తూ  మళ్లీ వచ్చాయి మంచిరోజులు (అచ్ఛే దిన్‌) అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు. ‘‘సామాన్యుల ప్రభుత్వమని చెబుతూ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచడం సిగ్గుచేటు’’ అంటూ 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై భాజపా నేత స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని