సీఎంగా స్టాలిన్‌కు ప్రజాదరణ.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ వైపు తమిళుల మొగ్గు

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు ప్రజాదరణ పెరుగుతోందని ఇండో ఏషియన్‌ న్యూస్‌ సర్వీస్‌ (ఐఏఎన్‌ఎస్‌)-సీఓటర్‌ సర్వే వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా వెల్లడించిన ఈ సర్వే వివరాల ప్రకారం.. 2021లో

Published : 23 May 2022 08:38 IST

ఐఏఎన్‌ఎస్‌-సీఓటర్‌ సర్వేలో వెల్లడి

ఈనాడు, చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు ప్రజాదరణ పెరుగుతోందని ఇండో ఏషియన్‌ న్యూస్‌ సర్వీస్‌ (ఐఏఎన్‌ఎస్‌)-సీఓటర్‌ సర్వే వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా వెల్లడించిన ఈ సర్వే వివరాల ప్రకారం.. 2021లో ఎన్నికలు జరిగిన అస్సాం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పరంగా చూస్తే తమిళనాడు సర్కారు అత్యంత ప్రజాదరణ పొందిందని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రులందరిలో అత్యధికంగా 85% మద్దతు స్టాలిన్‌కే ఉన్నట్లు వెల్లడించారు.

కాబోయే ప్రధాని ఎవరైతే బాగుంటుందని తమిళనాడులో నిర్వహించిన ఇదే సర్వేలో.. రాహుల్‌గాంధీకి అనుకూలంగా 54% మంది మద్దతు తెలిపారన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి 32% మంది అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. మోదీ పనితీరు బాగుందని 17% మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 40% మంది కొంతవరకు బాగుందని తెలిపినట్లు పేర్కొన్నారు. ఇంకో 40% మంది అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రజలు తమ భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నట్లు తేలిందని తెలిపారు. సుమారు 45% మంది రానున్న ఏడాదిలో తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పారు. 13% మంది మాత్రం తమకు గడ్డు పరిస్థితి తప్పదన్నట్లుగా స్పందించారు. మరో 12% మంది వచ్చే ఏడాది కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయనే నిరాశను వ్యక్తం చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని