ఒమిక్రాన్‌పై మంత్రివర్గ ఉపసంఘం

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం సహా ఇతర చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఇందులో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు.

Published : 30 Nov 2021 05:10 IST

హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం సహా ఇతర చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఇందులో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రుల్లో పరిస్థితులను సమీక్షించి, మందులు, టీకాలను సమకూర్చుకోవాలని సోమవారం మంత్రిమండలి ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీకాల ప్రక్రియ వేగవంతం చేయాలని, మంత్రులందరూ వారి జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి.. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్‌, కుమురంభీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించింది. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని పరిస్థితులు, ఒమిక్రాన్‌ సన్నద్ధతపై నివేదిక సమర్పించారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై.. సుమారు 5 గంటలకు పైగా సాగింది. మొత్తం 12 అంశాలకు మూడింటిపై చర్చ జరిగింది. ఇందులో వరి ధాన్యం అంశం, కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు 4 గంటలసేపు చర్చించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌లు క్షేత్రస్థాయి, శాఖాపరమైన సమస్యలను వివరించారు. అరగంట పాటు కరోనా, ఒమిక్రాన్‌లపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని