వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా

Published : 05 Dec 2021 05:28 IST

15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల అందుబాటు
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల ఆరో తేదీ నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వివరాలకు www.knruhs.telangana.gov.in  వెబ్‌సైట్‌ సందర్శించాలని విశ్వవిద్యాలయం వర్గాలు సూచించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని