రాత్రి 7 వరకూ అవకాశం ఇవ్వాలి

రోజువారీ హాజరు కోసం ఉదయం 7 గంటలకే చెత్తసేకరణ ట్రాక్టర్లపై డ్రైవర్ల పక్కన కూర్చుని సెల్ఫీదిగి ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలన్న ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు.

Published : 24 Jan 2022 04:56 IST

డీఎస్‌ఆర్‌ నమోదుపై పంచాయతీ కార్యదర్శుల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రోజువారీ హాజరు కోసం ఉదయం 7 గంటలకే చెత్తసేకరణ ట్రాక్టర్లపై డ్రైవర్ల పక్కన కూర్చుని సెల్ఫీదిగి ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలన్న ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లో మల్టీపర్పస్‌ వర్కర్ల ద్వారా పనిచేయించే పర్యవేక్షణ అధికారులు పంచాయతీ కార్యదర్శులన్న విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు మరిచిపోయి కించపరస్తున్నారని విమర్శిస్తున్నారు. పంచాయతీ చట్టంలో కార్యదర్శులను తొలగించే అవకాశముందన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల్లోగా డీఎస్‌ఆర్‌(రోజువారీ పారిశుద్ధ్య నివేదిక)ను నమోదు చేసే అవకాశం కొనసాగించాలని లేకుంటే డీఎస్‌ఆర్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తామని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్‌ ఫోరం, సంఘం అధ్యక్షులు ఎ.మహేష్‌, మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. చట్టంలోని ఇతర సమస్యల పరిష్కారం కోసం మిగతా సంఘాలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని