
Published : 27 Jan 2022 05:08 IST
28 నుంచి హైదరాబాద్ సాహితీ ఉత్సవం
ఈనాడు, హైదరాబాద్ : హైదరాబాద్ సాహితీ ఉత్సవం ఈ ఏడాది జనవరి 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. కొవిడ్‌తో వరసగా రెండో ఏడాదీ వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ వంటి వారు పాల్గొంటున్నారు. ఈసారి వేడుకలను ఫెస్టివల్ డైరెక్టర్లలో ఒకరైన దివంగత అజయ్ గాంధీకి అంకితమిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ సాహితీ ఉత్సవం (హెచ్‌ఎల్‌ఎఫ్) 2010లో ప్రారంభమైంది. మొదట్లో వేర్వేరు వేదికలపై నిర్వహించగా.. కొన్నేళ్లుగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహిస్తున్నారు.ఈ దఫా యూకేని అతిథ్య దేశంగా ఆహ్వానించారు. భారతీయ భాషల్లో ఈసారి పంజాబ్ భాషపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
Tags :