8 నెలల్లో.. పన్నుల రాబడి 60 శాతం
రాష్ట్రానికి పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 60 శాతం ఆదాయం లభించింది. ఇది గత ఏడాది కన్నా 16 శాతం అధికం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రాబడి లక్ష్యం రూ.1,06,900 కోట్లు కాగా నవంబరు వరకు రూ.64,857 కోట్లు వచ్చింది.
అంచనాల మేరకు అమ్మకం పన్ను
అదే బాటలో జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయం
గణనీయంగా తగ్గిన గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర రాబడి
కాగ్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రానికి పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 60 శాతం ఆదాయం లభించింది. ఇది గత ఏడాది కన్నా 16 శాతం అధికం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రాబడి లక్ష్యం రూ.1,06,900 కోట్లు కాగా నవంబరు వరకు రూ.64,857 కోట్లు వచ్చింది. నవంబరు నాటికి రాష్ట్ర రాబడులు, వ్యయాలపై రాష్ట్ర ఆర్థికశాఖ కాగ్‌కు పూర్తి వివరాలు అందించింది. ఈ గణాంకాల్లో ప్రధానంగా ఎక్సైజ్ రాబడి, అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడులు 60 శాతానికి పైగా ఉన్నాయి. పన్నేతర రాబడిని రూ.30,557 కోట్లుగా అంచనా వేయగా.. రూ.4,395 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ రాబడిలో ప్రధానంగా భూముల విక్రయాల ద్వారా రూ.20వేల కోట్లకు పైగా సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇదింత వరకు రూ.4వేల కోట్లకే పరిమితమైంది.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రభుత్వం భారీగా అంచనా వేసింది. అయితే నవంబరు వరకు కేవలం 15శాతం లోపే ఆదాయం వచ్చింది. ఈ కేటగిరీ కింద ఈ ఏడాదికి రూ.38,669 కోట్లు అంచనా వేయగా, మొదటి 8 నెలల్లో రూ.5,687కోట్లు మాత్రం వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందకపోవడంతో ఈ రాబడి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం రూ.1,69,383 కోట్లు అంచనా వేయగా.. నవంబరు వరకు రూ.81,883 కోట్ల ఖర్చయింది. ప్రధానంగా రెవెన్యూ ఖాతాలో రూ.34,763 కోట్లు వ్యయం కాగా, మిగిలినవి వడ్డీల చెల్లింపు, వేతనాలు, పింఛన్లు, సబ్సిడీలకు ఖర్చుచేసింది. రాష్ట్ర రాబడులు ప్రధానంగా జీఎస్టీ, అమ్మకంపన్ను, రిజిస్ట్రేషన్ రాబడులు, ఎక్సైజ్ ఆదాయం క్రమంగా పెరుగుతుండటంతో పన్నుల రాబడుల అంచనాలపై ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో రాబడులు గణనీయంగా పెరుగుతాయని ఆర్థిక శాఖ అంచనాలు వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్‌పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్‌రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్‌ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్‌ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్