కేంద్ర శాఖల్లో పోస్టులు భర్తీ చేయరా?
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడతామన్న భాజపా.. ఈ ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సైన్యంలో 3 లక్షలు, రైల్వేలో
మొత్తం 15.62 లక్షల ఖాళీలున్నాయ్
దళితబంధును దేశ వ్యాప్తంగా అమలు చేయండి: హరీశ్‌రావు
ఈటీవీ, సంగారెడ్డి: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడతామన్న భాజపా.. ఈ ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సైన్యంలో 3 లక్షలు, రైల్వేలో 3 లక్షలు.. కలిపి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15,62,000 ఖాళీలు ఉన్నా.. వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. దళితబంధు పథకం కార్యాచరణపై సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల కోసం ఇప్పటికే కలెక్టర్ల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేశామన్నారు. మార్చి మొదటి వారంలోపు యూనిట్లు ఏర్పాటవుతాయని తెలిపారు. వచ్చే బడ్జెట్లో ఈ పథకం కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కేంద్రం దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ప్రయత్నించకుండా.. భాజపా ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.
‘‘బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది. మేము నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఆర్థిక సాయం అందించి కాపాడుకుంటున్నాం. కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి, రాష్ట్రంలో తెరాస సర్కారుకు ఉన్న తేడా ఇదే’’ అని హరీశ్‌రావు అన్నారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు, నిధులు కేటాయించకుండా కేంద్రం మొండి చేయి చూపుతోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేదు’’ అని అన్నారు.
విద్యకు అత్యంత ప్రాధాన్యం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం దైనందినులను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్‌పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్‌రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్‌ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్‌ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!