బస్సుల కోసం రెండు సంస్థల టెండర్లు

రాష్ట్ర ఆర్టీసీకి నూతన బస్సుల సరఫరా కోసం రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశలవారీగా కొత్తవాటిని కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలిదశలో 1,016 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Published : 29 May 2022 05:16 IST

వచ్చే వారంలోగా ఖరారు: వీసీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీకి నూతన బస్సుల సరఫరా కోసం రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశలవారీగా కొత్తవాటిని కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలిదశలో 1,016 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అత్యాధునిక విద్యుత్తు, ఏసీ బస్సుల నుంచి పల్లె వెలుగు బస్సుల  కొనుగోలు కోసం కూడా టెండర్లు ఆహ్వానించి శనివారం తెరిచింది. టాటా, అశోక్‌ లేల్యాండ్‌ సంస్థలు మాత్రమే దాఖలు చేశాయి. సాంకేతికంగా రెండూ అర్హత పొందాయి. ఆర్థిక బిడ్స్‌ను పరిశీలించిన మీదట అర్హత పొందిన సంస్థను ఖరారు చేస్తారు. ధరల విషయంలో సంప్రదింపులు నిర్వహించిన మీదట వారం రోజుల వ్యవధిలో తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ‘ఈనాడు’కు చెప్పారు. అన్ని బస్సుల కోసం టెండర్లు దాఖలయ్యాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని