న్యాయవాదుల రక్షణ చట్టం అవసరం: ఐఎల్‌పీఏ

న్యాయవాదులు వృత్తిపరంగా అనేక బెదిరింపులు, దాడులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో హత్యలకు గురవుతున్నారని ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌(ఐఎల్‌పీఏ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది.

Updated : 07 Aug 2022 05:57 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: న్యాయవాదులు వృత్తిపరంగా అనేక బెదిరింపులు, దాడులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో హత్యలకు గురవుతున్నారని ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌(ఐఎల్‌పీఏ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. గతంలో వామన్‌రావు దంపతులు, తాజాగా వరంగల్‌లో మల్లారెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో ‘న్యాయవాదుల రక్షణ చట్టం’ తేవాలని కోరింది. సంఘం ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సునీల్‌గౌడ్‌, ఐఎల్‌పీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం విజయదేవరాజ్‌గౌడ్‌, ఎన్‌.జె.శాంసన్‌ తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని