కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు

ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్‌ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు.

Published : 04 May 2024 05:25 IST

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్‌ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న ఆమె జ్యుడిషియల్‌ కస్టడీ ఈ నెల 7న ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు తనను కోర్టు ముందు నేరుగా హాజరుపరచాలని కోరారు. ఇదివరకు జ్యుడిషియల్‌ కస్టడీ ముగిసే సమయంలో తనను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఆమె ఈ దరఖాస్తు దాఖలుచేశారు. దీనిపై సీబీఐ, ఈడీలు సమాధానం చెప్పాలని కోరుతూ రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నోటీసులు జారీ చేశారు. కవితను ఇదివరకు కోర్టులో హాజరుపరిచేటప్పుడు ఆమె మీడియాతో మాట్లాడటం, దర్యాప్తు జరుగుతున్న తీరుతోపాటు, దర్యాప్తు సంస్థలపై వ్యాఖ్యలు చేయడం పట్ల న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఇకమీదట అలా చేయొద్దని ఆమె తరఫు న్యాయవాదికి సూచించారు. దీంతో తదుపరి విచారణలో పోలీసులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని