జస్టిస్‌ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి

ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది.

Updated : 04 May 2024 07:02 IST

ఆయన న్యాయసేవలను కొనియాడిన సీజే

ఈనాడు, అమరావతి: ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ నేతృత్వంలో శుక్రవారం మొదటి కోర్టు హాలులో సంతాపం ప్రకటించేందుకు న్యాయమూర్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన అందించిన న్యాయ సేవలను కొనియాడారు. జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు పలు కీలక తీర్పులిచ్చారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని