టెట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల

ఈ నెల 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది.

Published : 04 May 2024 05:22 IST

మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. పేపర్‌-2లో ఈనెల 20 నుంచి 22 వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు; 24న మైనర్‌ మీడియం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు; 28, 29 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి.

పేపర్‌-1 పరీక్షలు 30, 31 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో జరుగుతాయి. జూన్‌ ఒకటో తేదీన మైనర్‌ మీడియంలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు; జూన్‌ 2న ఇంగ్లిష్‌, తెలుగు మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని