దేశ సమైక్యత కోసం రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగం: వీహెచ్‌

దేశ సమైక్యత కోసం తన ప్రాణాన్ని అర్పించిన త్యాగశీలి రాజీవ్‌గాంధీ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్‌గాంధీ స్మారకజ్యోతి

Published : 14 Aug 2022 05:28 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దేశ సమైక్యత కోసం తన ప్రాణాన్ని అర్పించిన త్యాగశీలి రాజీవ్‌గాంధీ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్‌గాంధీ స్మారకజ్యోతి శనివారం ఉదయం గాంధీభవన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన రాజీవ్‌గాంధీ ఆశయాలను అమలు చేయాలని, అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు.

‘కాళేశ్వరం’ కుంభకోణంపై ఫిర్యాదు చేశా

కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల కొనుగోలు కుంభకోణం తదితర అంశాలపై కాగ్‌, కేంద్ర నీటిపారుదలశాఖ, ఈడీలకు ఫిర్యాదు చేసినట్లు ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని