సిడ్నీలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన

చేనేత కళాకారుల పని తీరు అద్భుతంగా ఉందని న్యూ సౌత్‌ వేల్స్‌ గవర్నర్‌ మార్గరెట్‌ బీజ్లీ  అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ హ్యాండ్లూమ్‌

Published : 16 Aug 2022 05:19 IST

చేనేత కళాకారుల పని తీరు అద్భుతంగా ఉందని న్యూ సౌత్‌ వేల్స్‌ గవర్నర్‌ మార్గరెట్‌ బీజ్లీ  అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ హ్యాండ్లూమ్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ పవర్‌హౌస్‌ మ్యూజియంలో ‘చరక కర్గా’ పేరుతో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన టై అండ్‌ డై సంఘం అధ్యక్షుడు, హ్యాండ్లూమ్‌ నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అవార్డు గ్రహీత తడ్క రమేష్‌ ఆధ్వర్యంలో.. అక్కడి ప్రజలకు ఇక్కత్‌ వస్త్ర కళను, మగ్గం నేయడం, చిటికి చుట్టడం వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మార్గరెట్‌ బీజ్లీ సందర్శించి చేనేత వస్త్ర కళాకారుల పనితనాన్ని స్వయంగా పరిశీలించారు. ఆస్ట్రేలియాలోని భారతీయులు సంప్రదాయ వస్త్రాలంకరణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సిడ్నీలోని ఒపెరా హౌస్‌ను మూడు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

-న్యూస్‌టుడే, భూదాన్‌పోచంపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని