గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన రాలేదు

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

Published : 07 Feb 2023 03:21 IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

ఈనాడు, దిల్లీ: గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉందన్నారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి బిహార్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తమకు రాలేదని మంత్రి తెలిపారు.

* కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా, ఆర్థిక సంఘం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాలు, అదనపు సహాయాలు, ప్రత్యేక సహాయాలు, పెట్టుబడుల కింద ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా పెట్టుకోవచ్చని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ పారిశ్రామిక నడవా, హుజూరాబాద్‌, జడ్చర్ల, గద్వాల, కొత్తకోట నడవాల్లో పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు అందాయా? అని ఎంపీలు మాలోత్‌ కవిత, వెంకటేష్‌ నేత, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* హైదరాబాద్‌ ఫార్మా సిటీ మాస్టర్‌ ప్లాన్‌, మౌలిక వసతులకు సంబంధించి తమ వంతు నిధులను ఇప్పటికే పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) మంజూరు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని