మారువేషంలో మళ్లీ గ్లోబరీనా వస్తోంది

గతంలో ఇంటర్‌బోర్డు ఫలితాల ప్రక్రియ చేపట్టి విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కారణమైన గ్లోబరీనా సంస్థ మళ్లీ ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం కొత్త పేరుతో బోర్డులోకి ప్రవేశించబోతోందని, అందుకు నవీన్‌మిత్తల్‌ సహకరిస్తున్నారని ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు.  

Published : 08 Feb 2023 08:55 IST

ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ
ఖండించిన నవీన్‌మిత్తల్‌

ఈనాడు, హైదరాబాద్‌: గతంలో ఇంటర్‌బోర్డు ఫలితాల ప్రక్రియ చేపట్టి విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కారణమైన గ్లోబరీనా సంస్థ మళ్లీ ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం కొత్త పేరుతో బోర్డులోకి ప్రవేశించబోతోందని, అందుకు నవీన్‌మిత్తల్‌ సహకరిస్తున్నారని ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు.   మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం ఈనెల 1వ తేదీన ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించగా... కొత్త సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారని చెప్పారు.

అవి తప్పుడు ఆరోపణలు

అవినీతి కేసులో సస్పెండైన మధుసూదన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని, తప్పుడువని నవీన్‌ మిత్తల్‌ ఖండించారు. తనపై చర్యలు తీసుకునే ఏ అధికారిపైనైనా మధుసూదన్‌రెడ్డి బురద జల్లుతారని విమర్శించారు. మరో వైపు గతంలో నమోదైన పలు కేసులపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని మధుసూదన్‌రెడ్డికి నవీన్‌మిత్తల్‌ ఛార్జి మెమోలు జారీ చేశారు. గ్లోబరీనాకు కానీ, కొత్తగా పేరుమారిన సంస్థకు కానీ, బ్లాక్‌లిస్ట్‌లో ఉంచిన ఏ కంపెనీకి కూడా టెండర్లలో పాల్గొనే అర్హత లేదని ఇంటర్‌ బోర్డు మరో ప్రకటనలో స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని