ఆటస్థలం కాదు.. ఆసుపత్రే..!

ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం (పిడియాట్రిక్‌ వార్డు)లోని ముస్కాన్‌ కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పడకల మధ్యలో, నడిచే దారిలో రంగులతో ఏబీసీడీలు, తెలుగు అక్షరమాల రాయించారు.

Published : 23 Mar 2023 04:07 IST

ఈనాడు, ఖమ్మం; న్యూస్‌టుడే, ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం (పిడియాట్రిక్‌ వార్డు)లోని ముస్కాన్‌ కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పడకల మధ్యలో, నడిచే దారిలో రంగులతో ఏబీసీడీలు, తెలుగు అక్షరమాల రాయించారు. వైకుంఠపాళి, ఇతర చిత్రాలు చిన్న పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందే చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఆటబొమ్మలనూ అందుబాటులో ఉంచారు.  వీటిని చూడగానే చిన్నారుల మోముపై   చిరునవ్వులు విరబూస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని