20 ఏళ్లు పైబడి సర్వీసు ఉన్న ఒప్పంద సిబ్బందిని క్రమబద్ధీకరించండి

రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా విద్య, వైద్య రంగాలతోపాటు వివిధ ప్రభుత్వశాఖల్లో ఒప్పంద ఉద్యోగులు, లెక్చరర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు

Updated : 01 Apr 2023 06:03 IST

సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా విద్య, వైద్య రంగాలతోపాటు వివిధ ప్రభుత్వశాఖల్లో ఒప్పంద ఉద్యోగులు, లెక్చరర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘ఉద్యోగాల క్రమబద్ధీకరణకు 2016లోనే ప్రభుత్వం జీవో 16ను జారీచేసినా న్యాయస్థానాల తాత్కాలిక ఉత్తర్వులతో నిలిచిపోయింది. 2021 డిసెంబరులో సుప్రీంకోర్టు నుంచి సానుకూలమైన తీర్పు వచ్చింది. అప్పట్లో 11,108 మంది ఒప్పంద కార్మికులకు న్యాయం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన నేటికీ అమలుకాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న కూడా శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో ఏప్రిల్‌ 1 నుంచి క్రమబద్ధీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ, దీనికి సంబంధించి ఉత్తర్వులు నేటికీ జారీకాలేదు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీ చేసేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’  అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని