Vemulawada: నిర్మాణ లోపంతో రూ.14.17 కోట్లు ‘ఢాం’

కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యాంను అధికారులు జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చివేసిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 06 Sep 2023 08:44 IST

బొల్లారంలో మూలవాగుపై చెక్‌డ్యాం పేల్చివేత
ఇళ్లకు ప్రమాదం పొంచి ఉండటంతో అధికారుల చర్య

వేములవాడ, న్యూస్‌టుడే: కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యాంను అధికారులు జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చివేసిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేములవాడ గ్రామీణ మండలంలోని బొల్లారం గ్రామ సమీపంలో మూలవాగుపై గత ఏడాది   రూ.14.17 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఈ చెక్‌డ్యాం సైడ్‌బండ్‌ భారీగా కోతకు గురైంది. ఆకృతి లోపంతో ఎత్తుగా నిర్మించడంతోనే ఇలా జరిగింది. తాజాగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తమ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని బొల్లారం వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరిగి ఇళ్లకు ప్రమాదం పొంచి ఉండటంతో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఆదేశాల మేరకు నీటిపారుదల, పోలీస్‌ శాఖల అధికారులు చెక్‌డ్యాం మధ్యలో జిలెటిన్‌స్టిక్స్‌ అమర్చి పేల్చివేశారు. మూలవాగుపై 130 మీటర్ల పొడవున్న చెక్‌డ్యాం మధ్యలో దాదాపు తొమ్మిది మీటర్ల పొడవు, ఒక మీటరు లోతుతో సిమెంట్‌, కాంక్రీట్‌ గోడను తొలగించి వరద సాఫీగా పోయేలా అధికారులు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని