పీసీబీ ఛైర్మన్‌గా సీఎస్‌

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నియమితులయ్యారు. మెంబర్‌ కన్వీనర్‌తో కలిపి 15 మందిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

Updated : 08 Mar 2024 05:14 IST

సభ్యులుగా 15 మంది నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నియమితులయ్యారు. మెంబర్‌ కన్వీనర్‌తో కలిపి 15 మందిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెంబర్‌ కన్వీనర్‌గా పీసీబీ సభ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. మిగిలిన 14 మంది సభ్యుల్లో ఐదుగురు అధికారులు, ముగ్గురు స్థానిక సంస్థల ప్రతినిధులు, ఆరుగురు ఇతరులు ఉన్నారు.

సభ్యులు వీరే..

అధికారులు: అటవీ పర్యావరణ, పురపాలక, ఆరోగ్యశాఖల ముఖ్యకార్యదర్శులు, పరిశ్రమలు, రవాణాశాఖ కమిషనర్లు  
స్థానిక సంస్థల ప్రతినిధులు: మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ఛైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, నిజామాబాద్‌ మున్సిపాలిటీ కార్పొరేటర్‌ మహ్మద్‌ హరూన్‌ఖాన్‌
ఇతరులు: జేఎన్టీయూ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీస్‌ అధ్యక్షుడు మీల జయదేవ్‌, కన్సార్షియం ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, టీఎస్‌ఐఐసీ, టీఎస్‌ఎండీసీ వీసీ, ఎండీలు..

రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గతంలో ఛైర్మన్‌గా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని