Ramesh Babu: కృష్ణ పెద్దకుమారుడు రమేష్‌బాబు కన్నుమూత

తెలుగు సినీ నటుడు కృష్ణ పెద్ద కుమారుడు, నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు(56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి

Published : 09 Jan 2022 05:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు సినీ నటుడు కృష్ణ పెద్ద కుమారుడు, నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు(56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో రాత్రి 8.40 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన రమేష్‌బాబు పలు సినిమాల్లో నటించారు. సోదరుడు మహేష్‌బాబు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1974లో అల్లూరి సీతారామరాజు సినిమాలో తొలిసారి బాలనటుడిగా నటించారు. 1997లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్‌.. రమేష్‌బాబు ఆఖరి సినిమా. కథానాయకుడిగా రమేష్‌బాబు తొలిసినిమా ‘సామ్రాట్‌’. బాలనటుడిగా, కథానాయకుడిగా 17 చిత్రాల్లో నటించారు. కొద్దికాలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు భార్య మృదుల, పిల్లలు భారతి, జయకృష్ణ ఉన్నారు. రమేష్‌బాబు కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని