బ్రా ఉతికేటప్పుడు..
దుస్తుల భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనం.. బ్రాలను నిర్లక్ష్యం చేస్తాం. లోదుస్తులే కదా అని.. నచ్చినట్లు ఉతికేసి, వాడేస్తుంటాం. దానివల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. మరి, అవి ఎక్కువ కాలం మన్నాలంటే..? ఇలా చేసి చూడండి...
దుస్తుల భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనం.. బ్రాలను నిర్లక్ష్యం చేస్తాం. లోదుస్తులే కదా అని.. నచ్చినట్లు ఉతికేసి, వాడేస్తుంటాం. దానివల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. మరి, అవి ఎక్కువ కాలం మన్నాలంటే..? ఇలా చేసి చూడండి...
⚛ బ్రాలను వాషింగ్ మెషీన్‌లో వేసే ముందు వాటి హుక్కుల్ని పెట్టేయాలి. లేదంటే ఉతికే క్రమంలో హుక్కులు విరిగిపోవడంతో పాటు బ్రా కూడా సాగుతుంది.
⚛ మెషీన్‌లో కంటే చేత్తో ఉతికితేనే బ్రాలు ఎక్కువ కాలం మన్నుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాషింగ్ సైకిల్ ఎక్కువ సమయం ఉండడం వల్ల అవి త్వరగా సాగిపోతాయి. అదే చేత్తో అయితే ఐదు నిమిషాల్లో ఉతికి ఆరేయచ్చు.
⚛ ప్రస్తుతం మార్కెట్లో బ్రా వాషింగ్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. ఇవి ప్రత్యేకంగా వీటి కోసమే రూపొందించారు కాబట్టి.. బ్రాలను ఇందులో పెట్టి వాషింగ్ మెషీన్‌లో వేసేయచ్చు. తద్వారా అవి సాగిపోకుండా ఉంటాయి. ఒకవేళ వాషింగ్ బ్యాగ్స్ లేకపోతే దిండు కవర్లైనా వాడుకోవచ్చు.
⚛ మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లలో బ్రాలను ఉతకడం వల్ల కొన్నాళ్లకు వాటిలోని ఎలాస్టిక్, వైర్ తరహా మెటీరియల్ దెబ్బతింటుంది. తద్వారా బ్రాలు త్వరగా పాడైపోతాయి. అందుకే వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లను ఉపయోగించడం శ్రేయస్కరం!
⚛ ప్యాడెడ్ బ్రాలను ఉతికేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో వాటి లోపల ఉండే మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్ డ్యామేజ్ కాకుండా చేత్తోనే సున్నితంగా ఉతకడం మంచిది.
⚛ వీటిని ఎక్కువసేపు డిటర్జెంట్‌లో నానబెట్టినా వాటి నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఐదు పది నిమిషాలు నాననిస్తే సరిపోతుంది.
⚛ బ్రాలను ఇతర దుస్తుల్లా వేలాడదీయకూడదు. పరిచినట్లు ఆరేయడం మంచిది. లేదంటే వాటి పట్టీలు సాగిపోయినట్లు అవుతాయి.
⚛ ఆరాక కూడా బీరువాలో/కప్‌బోర్డ్‌లో ఓ మూల పడేయడం కాకుండా.. వాటి హుక్కుల్ని కలిపి మడతపెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.