జయించారు.. అండగా నిలుస్తున్నారు!

రాలిపోతున్న జుట్టు.. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు.. శరీరాన్ని రంపపు కోతకు గురిచేసే కీమోలు..  ఇంతకన్నా చావే సుఖం అనిపించే సందర్భాలు.. ఈ పరిస్థితులని వాళ్లు జయించారు. తోటివారు గెలవడానికి కావాల్సిన స్థైర్యాన్నీ, సాయాన్నీ అందిస్తున్నారు.. 19 ఏళ్ల వయసు. ఎన్నో కలలు, సాధించాల్సిన లక్ష్యాలు.. వాటన్నింటినీ కూల్చేస్తూ స్వాగతిక ఆచార్య క్యాన్సర్‌ బారినపడింది.

Updated : 04 Feb 2023 05:57 IST

నేడు ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం

రాలిపోతున్న జుట్టు.. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు.. శరీరాన్ని రంపపు కోతకు గురిచేసే కీమోలు..  ఇంతకన్నా చావే సుఖం అనిపించే సందర్భాలు.. ఈ పరిస్థితులని వాళ్లు జయించారు. తోటివారు గెలవడానికి కావాల్సిన స్థైర్యాన్నీ, సాయాన్నీ అందిస్తున్నారు..

వాళ్లలో ధైర్యం నింపుతూ..

19 ఏళ్ల వయసు. ఎన్నో కలలు, సాధించాల్సిన లక్ష్యాలు.. వాటన్నింటినీ కూల్చేస్తూ స్వాగతిక ఆచార్య క్యాన్సర్‌ బారినపడింది. ‘పోరాడటం, నాకే ఎందుకిలా అయ్యిందని బాధపడటమనే రెండు దారులు కనిపించాయి. వాటిలో పోరాడటానికే సిద్ధమయ్యా. కీమోథెరపీ, రేడియో థెరపీల్లో భాగంగా వందల ఇంజెక్షన్లు. నాలుగు నెలలు మాటే రాలేదు. ద్రవ ఆహారమే గతి. ఆ స్థితిలోనూ నేను బయట పడగలననే నమ్మా. జుట్టు పోయింది, రంగు మారా, బరువు కోల్పోయా. దీనికితోడు ‘నీకు పెళ్లి కాదు, అమ్మానాన్నలకు బరువు’ వంటి సూటిపోటి మాటలు. నేను మాత్రం మానసికంగా బలంగా ఉండటంపైనే దృష్టి పెట్టా. అయితే ఎంతోమంది కుంగిపోవడం, భయపడటం గమనించా. చికిత్స తీసుకుంటూ, ఆర్థిక సమస్యల్లేని వీళ్లే ఇలా ఉంటే దాని గురించి అవగాహన లేని, ఖర్చు భరించలేని వారి పరిస్థితేంటి అనిపించింది. అందుకే ఉచితంగా సేవలందించే సంస్థల గురించి తెలుసుకొని, క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఏడాదికి 2018 చివర్లో ‘అవాకెన్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్ట్‌’ ప్రారంభించా’నంటుంది స్వాగతిక. ఈమెది కటక్‌. తన ఎన్‌జీఓ ద్వారా వేల క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాలతోపాటు 5 వేల మంది గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించింది. బాధితులకు వైద్యసదుపాయాలు, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తోంది. ‘నేను క్యాన్సర్‌ జయించా.. మీరూ జయించగల’రంటూ రోగుల్లో ధైర్యాన్నీ నింపుతోంది.


అమ్మల కోసం..

ర్త సర్జన్‌. స్వస్థలం ఎర్నాకుళం. ఆయన ఉద్యోగరీత్యా అబుదాబిలో స్థిరపడ్డారు. రొమ్ములో గడ్డ ఏర్పడినట్టుగా అనిపించగానే ప్రేమి మాథ్యూకి పరీక్షలు చేయించారాయన.  రొమ్ము క్యాన్సర్‌ అని తేలింది. రెండో దశే కాబట్టి ఆరునెలల చికిత్సతో బయటపడ్డారు. ‘ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించను. గతంలోనే గడ్డని గమనించి వైద్యులను సంప్రదిస్తే ‘సాధారణమైనదే’ అని కొట్టిపడేశారు. మావారికి చెబితే అనుమానంతో పరీక్ష చేయించారు. ‘క్యాన్సర్‌ గమనించగానే పరీక్షించుకోవాల్సింది’ అన్నారు నిపుణులు. 6 నెలలకు బయటపడినా.. ఇంత జాగ్రత్తగా ఉండే నా పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా వాళ్ల సంగతేంటి అనిపించింది. అందుకే 2011లో ‘ప్రొటెక్ట్‌ యువర్‌ మామ్‌ ఇంటర్నేషనల్‌’ ప్రారంభించా. ఎలాగూ ప్రొఫెసర్‌నే! స్కూళ్లూ, కళాశాలలకు వెళ్లి పిల్లలను వాళ్లమ్మలు రొమ్ము పరీక్షలు చేయించుకునేలా చూశా. క్యాన్సర్‌ చికిత్సలో చాలామంది జుట్టును కోల్పోతుంటారు. వైద్యులు ఫర్లేదన్నా జుట్టు లేకుండా ఉన్న ముఖాన్ని అద్దంలో చూసుకోవడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశమే! చాలామందికి చికిత్సకే డబ్బు ఉండదు. ఇక విగ్గులపై ఏం దృష్టి పెడతారు. అందుకే 2013లో ‘హెయిర్‌ ఫర్‌ హోప్‌’ ప్రారంభించి జుట్టు దానాన్ని ప్రోత్సహించా. వాటితో విగ్గులు చేయించి, పేదవాళ్లకి అందిస్తున్నా. భారత్‌తోపాటు యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాల నుంచి 30వేల మందికి పైగా జుట్టు దానం చేశారు. క్యాన్సర్‌ బాధితులకు సాయపడేలా భారత్‌లో ఫౌండేషన్‌ నెలకొల్పాలన్నది కల. ఇప్పుడా ప్రయత్నంలోనే ఉన్నా’ననే 59 ఏళ్ల ప్రేమీ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ‘100 విమెన్‌ అచీవర్స్‌ ఇన్‌ ఇండియా’, ‘సూపర్‌ 100 విమెన్‌ ఇన్‌ ఏషియా’ వంటి జాబితాల్లోనూ నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్