కేన్స్‌కు... అమ్మచీర!

కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌... ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద డిజైనర్లు తయారుచేసిన ఫ్యాషన్‌ దుస్తుల్లో అందాల తారలు హొయలుపోతూ ఫొటోలకు పోజులిస్తుంటారు కదా! అయితే, అందులో ఒకమ్మాయి మాత్రం చీరకట్టుతో, ముక్కుకు ముక్కెర, కొప్పులో పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఎవరామె అంటారా? తనే ‘లాపతా లేడీస్‌’ నటి ఛాయా కదమ్‌.

Updated : 24 May 2024 04:34 IST

కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌... ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద డిజైనర్లు తయారుచేసిన ఫ్యాషన్‌ దుస్తుల్లో అందాల తారలు హొయలుపోతూ ఫొటోలకు పోజులిస్తుంటారు కదా! అయితే, అందులో ఒకమ్మాయి మాత్రం చీరకట్టుతో, ముక్కుకు ముక్కెర, కొప్పులో పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఎవరామె అంటారా? తనే ‘లాపతా లేడీస్‌’ నటి ఛాయా కదమ్‌. ఇటీవల కాలంలో తమ పెళ్లి వేడుకల్లో అమ్మచీర వేసుకుని మురిసిపోయే అమ్మాయిలెందరో! అయితే, ఛాయా మాత్రం వాళ్ల అమ్మ చీరను ఏకంగా ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ధరించి, తన డెబ్యూ ప్రదర్శన ఇచ్చింది. సాధారణంగా ఈ షో కోసం ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు, నెలల కొద్దీ కష్టపడి మరీ, దుస్తులు డిజైన్‌ చేస్తుంటారు. అటువంటి వేడుకలో ఈ లోకంలో లేని తన తల్లికి గుర్తుగా ఈ చీరను ధరించి అమ్మపై తనకున్న ప్రేమను చాటుకుంది ఛాయా. ‘‘ అమ్మా... నిన్ను విమానం ఎక్కించాలనే నా కోరిక తీరలేదు. కానీ, ఈరోజు నీ చీర, ముక్కు పుడకతో విమానంలో కేన్స్‌కు వెళ్తున్నా. ఇదంతా చూడడానికి నువ్వు నా పక్కన ఉండి ఉంటే బాగుండు. లవ్‌ యూ అమ్మ... నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నా’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో తన భావోద్వేగాల్ని పంచుకుంది ఛాయా.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్