వీటిని.. ఇలా కూడా!

కాటన్ బాల్స్.. బ్యూటీ కిట్‌లో ఉండే వీటి గురించి మనకు తెలిసిందే. అయితే చాలామంది వీటిని సౌందర్య సంరక్షణలో భాగంగా మాత్రమే వాడుతుంటారు. అయితే వీటిని ఇతరత్రా ఎన్నో రకాలుగా....

Published : 18 Nov 2022 19:53 IST

కాటన్ బాల్స్.. బ్యూటీ కిట్‌లో ఉండే వీటి గురించి మనకు తెలిసిందే. అయితే చాలామంది వీటిని సౌందర్య సంరక్షణలో భాగంగా మాత్రమే వాడుతుంటారు. అయితే వీటిని ఇతరత్రా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

బయటికి వెళ్లేటప్పుడు..

⚜ బయటికి వెళ్లేటప్పుడు మీ వద్ద పాకెట్‌ పెర్‌ఫ్యూమ్‌ లేదనుకోండి.. ఏం చేస్తారు? ఇంట్లో ఉండే పెద్ద పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ని బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్తాం అంటారా? దానికి ప్రత్యామ్నాయంగా ఈ సింపుల్‌ టిప్‌ని పాటిస్తే సరి! ఇందుకోసం కొన్ని కాటన్‌ బాల్స్‌పై పెర్‌ఫ్యూమ్‌ని స్ప్రే చేసుకొని లేదంటే కొన్ని చుక్కల సెంట్‌ వేసి జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టేసుకోవాలి. ఇక మీకు అవసరమైనప్పుడు ఆ బాల్స్‌తో మెడలు, డ్రస్‌.. ఇలా మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టచప్‌ ఇస్తే సరిపోతుంది.

⚜ బయటికి వెళ్లినప్పుడల్లా మేకప్‌ కిట్‌ మోసుకెళ్లడం ఇబ్బందిగా ఉందా? అయితే ఆ సమయంలో మధ్యమధ్యలో టచప్‌ ఇవ్వాలనుకున్న బ్రాంజర్‌, బ్లష్‌.. వంటి వాటిలో వేర్వేరుగా కాటన్‌ బాల్‌ను అద్ది.. జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్లాలి. వాటితో కావాల్సినప్పుడు అందానికి మెరుగులద్దుకోవచ్చు.

⚜ ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే కాటన్‌బాల్స్ నింపిన చిన్న కుషన్స్‌ మధ్యలో వీటిని అమర్చడం, లేదంటే వాటికి సపోర్ట్‌గా ఉంచడం ఉత్తమం.

వీటి కోసం..

⚜ కొత్త చెప్పులు లేదా షూస్‌ వేసుకున్నప్పుడు వాటి రాపిడికి అక్కడక్కడా పాదాలపై దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం మనకు అనుభవమే. అలాంటి సందర్భాల్లో మళ్లీ వాటిని వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలా జరగకూడదంటే ఆయా భాగాలపై కాటన్‌ బాల్స్ ఉంచి.. చెప్పులు లేదా షూస్‌ వేసుకోవడం మంచిది.

⚜ పిల్లలు డ్రాయింగ్‌ వేసే క్రమంలో వారి చేతులపై మార్కర్‌ మరకలు పడుతుంటాయి. అవి మామూలుగా కడిగితే ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు పాలల్లో ముంచిన కాటన్‌ బాల్‌తో మరకలు పడిన చోట రుద్దితే ఇట్టే వదిలిపోతాయి.

⚜ దుస్తులపై పడిన సిరా మరకల్ని తొలగించడానికీ కాటన్ బాల్‌ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఆల్కహాల్‌ ద్రావణంలో ముంచిన కాటన్‌ బాల్‌తో మరక పడిన చోట నెమ్మదిగా రుద్ది.. ఆపై ఉతికేస్తే సరిపోతుంది.

⚜ ఎండ వేడికి చర్మం కందిపోయి మంట పుడుతుంది. అలాంటప్పుడు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో ముంచిన కాటన్‌ బాల్‌తో సమస్య ఉన్న చోట రాస్తే మంట తగ్గి చల్లబడుతుంది.

⚜ పంటి నొప్పి వేధిస్తున్నట్లయితే లవంగం నూనెలో ముంచిన కాటన్‌ బాల్‌ను నొప్పి ఉన్న చోట కాసేపు ఉంచితే ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్