తన చెయ్యి పడ్డ బహుమతులు మనసును గెలిచేస్తాయి!
ఏ వేడుకైనా, ప్రత్యేక సందర్భమైనా.. ఎదుటివారి అభిరుచిని బట్టి ఓ అందమైన కానుకను వారికి బహూకరించడం మనకు అలవాటు. మరి, ఈ బహుమతికి మన మనసులోని భావాల్ని కూడా జతచేస్తే.. ఆ కానుక ఎంతో అమూల్యమైనదిగా....
(Photos: Instagram)
ఏ వేడుకైనా, ప్రత్యేక సందర్భమైనా.. ఎదుటివారి అభిరుచిని బట్టి ఓ అందమైన కానుకను వారికి బహూకరించడం మనకు అలవాటు. మరి, ఈ బహుమతికి మన మనసులోని భావాల్ని కూడా జతచేస్తే.. ఆ కానుక ఎంతో అమూల్యమైనదిగా మారిపోతుంది. దిల్లీకి చెందిన కృతికా సభర్వాల్ చేస్తోందీ ఇదే. నచ్చిన వారి కోసం కొన్న కానుకను ఏదో అలా పైపైన గిఫ్ట్ ర్యాపింగ్ చేసేసి.. పంపించేయడం కాకుండా.. తమ మనసులోని భావాలను సైతం ఆకట్టుకునేలా తెలియచేసేలా బహుమతులను ప్యాకింగ్ చేస్తూ ఎంతోమంది మనసు దోచుకుంటోందామె. దీన్నే వ్యాపారంగా మలచుకొని లక్షలు ఆర్జిస్తోంది. ‘నచ్చిన వారికి మనమిచ్చే బహుమతి.. వారిపై మనకున్న ప్రేమ, మనోభావాల్ని ప్రతిబింబించేలా ఉండాలం’టోన్న కృతిక బిజినెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి..
దిల్లీకి చెందిన కృతిక డిగ్రీ పూర్తయ్యాక.. పెర్ల్ అకాడమీ నుంచి ‘గ్రూమింగ్-స్టైలింగ్’ విభాగంలో సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ‘ESL లాంగ్వేజ్ టీచింగ్’లో పీజీ డిప్లొమా పూర్తి చేసింది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.. కృతికకు గిఫ్ట్ ర్యాపింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఈ ఇష్టంతోనే చిన్నతనం నుంచి తన స్నేహితులకు అందించే బహుమతుల్ని అందంగా ప్యాక్ చేసి ఇచ్చేదామె. మరోవైపు తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కోసం కూడా కానుకల్ని సృజనాత్మకంగా ర్యాప్ చేసి అందించేది. అవి వారికెంతో నచ్చేవి.
ఆసక్తే.. వ్యాపారమైంది!
తనలో ఉన్న ఈ ప్రత్యేకతనే ఎప్పటికైనా వ్యాపార సూత్రంగా మలచుకోవాలని నిర్ణయించుకున్న కృతిక.. 2013లో ‘ది స్మార్ట్ ర్యాప్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. ఈ క్రమంలో ఈవెంట్ ప్లానర్స్, బేకర్స్, గిఫ్ట్‌లు తయారుచేసే సంస్థలు, గృహాలంకరణ వస్తువులు తయారుచేసే బ్రాండ్స్, చాక్లెట్స్ తయారీదారులతో చేతులు కలిపింది కృతిక. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పాపాయి పుట్టిన సందర్భాలు.. ఇలా వేడుకకు తగ్గట్లుగా.. ఆయా థీమ్ ప్రతిబింబించేలా కానుకల్ని సృజనాత్మకంగా ప్యాక్ చేసి అందించేదామె. ఈ క్రమంలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకూ ప్రాధాన్యమిచ్చేది. ఇలా తన నైపుణ్యాలతో తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించింది. ‘నచ్చిన వారి కోసం గిఫ్ట్ ర్యాప్ చేస్తోన్న ప్రతిసారీ అందమైన అనుభూతి కలిగేది. ప్రేమ, మనసులోని భావాల్ని కలగలిపి చేసిన ఈ ప్యాకింగ్ చూడ్డానికీ ఆకర్షణీయంగా కనిపించేది.. ఈ పాజిటివిటీనే నన్ను ఈ వ్యాపారంలో నిలదొక్కుకునేలా చేసింది..’ అంటోంది కృతిక.
నలుగురికీ నైపుణ్యాలు పంచుతూ..!
సాధారణంగా గిఫ్ట్ ర్యాపింగ్ అంటే చాలామంది అమ్మాయిలకు, మహిళలకు ఇష్టముంటుంది. అయితే దీనికే కాస్త సృజనాత్మకతను జోడిస్తే.. లాభదాయకమైన వ్యాపార సూత్రంగా మలచుకోవచ్చన్న ఆలోచన వచ్చింది కృతికకు. ఇదే 2016లో గిఫ్ట్ ర్యాపింగ్ ట్యుటోరియల్స్ ప్రారంభించేందుకు కారణమైంది. ఇంట్లో చిన్న వర్క్‌షాప్‌తో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించిన ఆమెకు.. మహిళల నుంచి క్రమంగా మంచి స్పందన రావడం మొదలైంది. ఆపై వేర్వేరు చోట్ల వర్క్‌షాప్స్ ఏర్పాటుచేయడం, ఆన్‌లైన్ క్లాసులు/వర్క్‌షాప్స్ నిర్వహించడం.. ఇలా ఓవైపు తాను క్రియేటివ్‌గా గిఫ్ట్ ర్యాపింగ్ చేయడంతో పాటు.. ఎంతోమందిని ఈ కళలో నిష్ణాతుల్ని చేస్తోందామె. ఇలా ఇప్పటివరకు 200 లకు పైగా ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్, 600 కి పైగా ఆన్‌లైన్ వర్క్‌షాప్స్, 20కి పైగా ప్రొఫెషనల్ కోర్సుల్ని అందించిన ఈ ప్యాకింగ్ లవర్.. 5000 మందికి పైగా మహిళలకు ఇందులో శిక్షణ ఇచ్చింది.
‘ముదురు రంగులో ఉండే గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్‌పై మోటివ్స్‌తో అలంకరిస్తే.. చూడ్డానికి అందంగానే కాదు.. మనసుకు ఆహ్లాదకరంగానూ ఉంటుంది. మేము అలంకరించే గిఫ్ట్ ప్యాకింగ్‌లో ఎక్కువమంది ఇష్టపడేది బొహెమెయిన్ థీమ్ ప్యాకింగ్. ఇది ఆయా బహుమతులకు వింటేజ్ లుక్‌ని అందించడమే దీనికి కారణం. అయితే ఈ క్రమంలో మేము వాడే ముడి వస్తువులు కంటికి ఇంపుగా ఉన్నవే కాదు.. పర్యావరణహితంగా ఉన్నవే ఎంచుకుంటాం..’ అంటూ తన సింపుల్ అండ్ సూపర్బ్ గిఫ్ట్ ర్యాపింగ్ టెక్నిక్స్ గురించి చెప్పుకొచ్చారు కృతిక.
ఎకో-ఫ్రెండ్లీ డెకరేషన్!
ప్రస్తుతం క్రిస్మస్, ఈద్, హిందువుల పండగల థీమ్స్‌లలో బహుమతులకు అందాన్ని తీసుకొస్తోన్న కృతిక.. మరోవైపు విభిన్న దేశాలకు సంబంధించిన గిఫ్ట్ ర్యాపింగ్ స్టైల్స్/టెక్నిక్స్‌ని కూడా తన నైపుణ్యాలకు జోడిస్తోంది. శాటిన్, మెష్, లేస్.. వంటి క్లాత్స్; బాటిల్స్, సాఫ్ట్ టాయ్స్, ఎండబెట్టిన పూరేకలు-ఆకులు, రిబ్బన్స్, మోటివ్స్, చాప్‌స్టిక్స్.. ఇలా ఈ ప్రకృతి మనకు అందించే ప్రతి వస్తువునూ తన గిఫ్ట్ ర్యాపింగ్‌లో భాగం చేస్తూ.. నచ్చిన వారు మెచ్చేలా ఆయా కానుకల్ని డెకరేట్ చేస్తోందామె. అంతేకాదు.. ‘ది స్మార్ట్ ర్యాప్ షాప్’లో భాగంగా.. ట్రేలు, బాస్కెట్స్, బాక్సులు, ఇతర గిఫ్ట్ ర్యాపింగ్ అలంకరణ వస్తువులెన్నో విక్రయిస్తోంది. స్వయానా గిఫ్ట్ ర్యాపర్‌గా, ఈ కళలో ట్యుటోరియల్స్ నిర్వహిస్తూ, ఆయా వస్తువుల్ని విక్రయిస్తూ.. ఇలా ఒక్క అంశంలోనే మూడు రకాల వ్యాపారాలతో లక్షలు ఆర్జిస్తోన్న కృతిక.. ‘మనం అందించే బహుమతి సందర్భానికి తగ్గట్లుగానే కాదు.. మన మనసులోని భావాల్ని ప్రతిబింబించేలా, మన ప్రేమను తెలిపేలా ఉండాలి.. అప్పుడే అవతలి వారి మనసును గెలుచుకోగలం’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- అరేబియన్ల అందం వెనుక..!
- హెయిర్ ఎక్స్టెన్షన్స్ వాడుతున్నారా?
- బొమ్మ లెహెంగాల సోయగం...
- వీటితో ‘ఐ మేకప్’ వేసుకోవడం సులువు!
- హ్యాండ్‌బ్యాగు కాదిది... లంచ్ బ్యాగు
ఆరోగ్యమస్తు
- Pregnancy Tips : పొట్ట దురద పెడుతోందా?
- పాదాలపై ఒత్తిడి తగ్గాలంటే...
- అందుకే నేలపై కూర్చొని తినాలట!
- వ్యాయామం మిస్ అవుతున్నారా
- బరువు తగ్గించే సోంపు టీ!
అనుబంధం
- తప్పటడుగు వేశాడు.. క్షమించాలా?
- అందుకే పిల్లలకూ ఆధ్యాత్మికత అవసరం!
- విసిగిపోకుండా వివరిద్దామా..
- సంకోచంగా కనిపిస్తే....
- పెళ్లైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటోంది..!
యూత్ కార్నర్
- Gauri Kekre : ఆమె కేక్స్ కథలు చెప్తాయ్!
- ఆమె మాటలే.. నన్ను గనుల్లోకి నడిపించాయి!
- వారమంతా ఉద్యోగం.. వారాంతాల్లో వ్యాపారం!
- లక్షల మందికి సాయం.. షార్క్‌లతో సావాసం!
- Payal Chhabra: దేశం కోసం విదేశీ ఆఫర్లనూ తిరస్కరించింది!
'స్వీట్' హోం
- గుడ్డు పెంకులు సులభంగా రావాలంటే..!
- అతికించేస్తే సరి
- స్విచ్ బోర్డు.. శుభ్రమిలా!
- కాటన్ బాల్స్‌ని ఇలా కూడా వాడచ్చు!
- ఇలా చేస్తే దోమల బెడద ఉండదు!
వర్క్ & లైఫ్
- థైరాయిడ్ సమస్యా..
- పని ప్రదేశంలో వారికే వేధింపులెక్కువట!
- మీకు మీరే రక్ష!
- Women Reservation Bill : 33 శాతానికి.. మూడు దశాబ్దాలు పట్టింది?
- సిబ్బందిలో ప్రేరణ కలిగించాలంటే..!