Published : 21/03/2023 00:13 IST

ఆమె అభిమానులు.. 40 కోట్లు!

న్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ఉమన్‌ ఎవరో తెలుసా? అమెరికన్‌ పాప్‌సింగర్‌ సెలెనా గొమెజ్‌. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణముంది. ఇన్‌స్టాలో ఆమెను అనుసరించేవారి సంఖ్య 40 కోట్లు. అందుకే పోస్టు పెడితే క్షణాల్లో లక్షల్లో లైకులు. వీడియో పెడితే కామెంట్ల వరద. వాటితో తనకు కాసుల వర్షమూ కురుస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోయర్లున్న మహిళెవరా అని పరిశీలిస్తే ఈమె అని తేలింది. గతంలో ఈ స్థానంలో నటి, వ్యాపారవేత్త కైలీ జెన్నర్‌ ఉండేది. 382 మిలియన్లు (38.2కోట్ల) ఫాలోయర్లతో ప్రథమ స్థానంలో ఉన్న ఆవిడను దాటి సెలెనా మొదటి స్థానంలో నిలిచింది. 2002లో ‘బార్నీ అండ్‌ ఫ్రెండ్స్‌’ అనే సీరియల్‌తో సెలెనా కెరియర్‌ ప్రారంభించింది. ‘చిన్నప్పుడు కెమెరా అంటేనే భయపడేదాన్ని. యాక్షన్‌, కట్‌ పదాలసలు పరిచయమే లేదు. బార్బీ నుంచే ప్రతి విషయాన్నీ నేర్చుకున్నా’ అనే సెలెనా 17 ఏళ్లప్పుడే యూనిసెఫ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యింది. 2017లో ‘బిల్‌బోర్డ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ గా ఎంపికైన ఈమె నటి, గాయని, నిర్మాత, వ్యాపారవేత్తగానే కాదు.. ఇంకా ఎన్నో అంశాల్లో దూసుకెళు తోంది. సాయంలోనూ ముందే! అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఇటీవల ఈమె నటించిన కొత్త సిరీస్‌ ‘ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ద బిల్డింగ్‌’ చిత్రంలోని ఫొటో ఇన్‌స్టాలో పోస్టు చేశాక ఫాలోయర్లు అమాంతం పెరిగారట. ఇంత అభిమానులున్న ఈమె మాత్రం ఒత్తిడికి గురైతే సోషల్‌ మీడియా నుంచి విరామం తీసుకుంటుందట. ‘ఇదెంతో ఆరోగ్యకరమైన నియమం. చాలా మానసిక ప్రశాంతత కలుగుతుంది’ కావాలంటే ప్రయత్నించి చూడండి అని సలహానీ ఇస్తోంది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి