వెల్లివిరిసిన కలువల వ్యాపారం..

చాలామంది గృహిణులకు ఒక్కోసారి ఖాళీ సమయాన్ని వృథా చేస్తున్నామనే బాధ ఉంటుంది. అయితే కేరళకు చెందిన విజీ అభి ఖాళీ సమయంలో తన మనసుకు నచ్చిన తోటపని చేస్తోంది.

Published : 10 Jun 2024 02:19 IST

చాలామంది గృహిణులకు ఒక్కోసారి ఖాళీ సమయాన్ని వృథా చేస్తున్నామనే బాధ ఉంటుంది. అయితే కేరళకు చెందిన విజీ అభి ఖాళీ సమయంలో తన మనసుకు నచ్చిన తోటపని చేస్తోంది. వందల రకాల లిలీలను పెంచుతూ నెలకు రూ.లక్షకు పైగా ఆదాయాన్నీ అందుకుంటుందీ. ఎలానో తెలుసుకుందామా!

ఇంట్లో పని అవ్వగానే ఎప్పుడెప్పుడు గార్డెన్‌లోకి వెళ్దామా అని ఎదురుచూస్తుంటుంది విజీ. తన గార్డెన్‌లోకి అడుగుపెట్టగానే రకరకాల రంగుల లిలీలు స్వాగతమిస్తాయి. ఫుల్‌టైం గార్డెనర్‌ కాకముందు ఆమె అకౌంటెంట్‌గా పనిచేసేదట. అయితే పిల్లల ఆలనాపాలన చూసుకోవటం కోసం తన ఉద్యోగాన్ని వదిలేసింది. అయితే సొంతగా ఏదో ఒకటి చేయాలనే తపన తనలో ఉండేది. దాంతో ఎంతో ఇష్టమైన గార్డెనింగ్‌ను ఎంచుకుంది. అందులో బొగైన్‌ విలియాలూ, ఆర్చిడ్లూ, గులాబీలనూ పెంచేది. అప్పుడే తను సామాజిక మాధ్యమాల్లో...ఎంతోమందికి రకరకాల మొక్కలు కొనాలనే ఆసక్తి ఉందని గమనించి, వాటర్‌ ప్లాంట్స్‌ను పెంచుదామనుకుంది. ఇంటర్‌నెట్‌లో గార్డెనర్స్, ప్లాంటర్స్‌ సోషల్‌ మీడియా గ్రూపుల్లో చేరి మొక్కల పెంపకానికి సంబంధించిన మెలకువలు నేర్చుకుంది. అలా ఇంటర్నేషనల్‌ వాటర్‌లిల్లీ అండ్‌ వాటర్‌ గార్డెనింగ్‌ సొసైటీలో చేరి, విదేశాల్లో ఉన్న గార్డెనర్ల సూచనలూ తీసుకునేది. ప్రస్తుతం వంద రకాలకు పైగా వాటర్‌ లిలీలను తన గార్డెన్‌లో పెంచడమే కాకుండా సొంతగా ‘నింఫేయాశ్రీ’ అనే కొత్త హైబ్రిడ్‌ రకాన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది. మార్కెట్లో వాటర్‌ లిలీలకు ఉన్న డిమాండ్‌ను తెలుసుకున్న విజీ, వాటిని ఫేస్‌బుక్‌ ద్వారా విదేశాలకూ సరఫరా చేసేది. సీజన్లో అయితే నెలకు రూ.లక్షకు పైనే ఆదాయం వస్తోంది. ‘ఇంట్లో కూర్చొని, నాకు నచ్చిన పనిచేసుకుంటూ ఆదాయాన్నీ పొందుతున్నా. అంతకంటే కావాల్సిందేముంది’ అంటారు విజీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్