అవాంఛిత రోమాలకు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ మంచిదేనా?

నా వయసు 28 సంవత్సరాలు. నా ముఖం మీద అవాంఛిత రోమాలు ఉన్నాయి. వీటిని తొలగించుకోవడానికి ఎలక్ట్రానిక్‌ లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలనుకుంటున్నా. ఇది మంచిదేనా? ఇతర చికిత్సలు ఏమైనా ఉన్నాయా?....

Updated : 22 Feb 2023 20:25 IST

నా వయసు 28 సంవత్సరాలు. నా ముఖం మీద అవాంఛిత రోమాలు ఉన్నాయి. వీటిని తొలగించుకోవడానికి ఎలక్ట్రానిక్‌ లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలనుకుంటున్నా. ఇది మంచిదేనా? ఇతర చికిత్సలు ఏమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీకు అవాంఛిత రోమాలు ఉన్నాయంటున్నారు. ముందుగా అవి ఎంత మందంగా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. సాధారణంగా మహిళల్లో పైపెదవి పైనా, బుగ్గల పైనా, గడ్డం పైనా, పొత్తి కడుపు పైనా దట్టంగా వెంట్రుకలు ఉంటే దానిని ‘హిర్సుటిజం’ అంటారు. వీటినే మనం అవాంఛిత రోమాలుగా పిలుస్తుంటాం.

అయితే దీనికి తగిన చికిత్స తీసుకునే ముందు ఆ సమస్య ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. సాధారణంగా పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తుంటుంది. కాబట్టి థైరాయిడ్‌ టెస్ట్‌, అల్ట్రాసౌండ్‌ స్కాన్, హార్మోన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు కారణం తెలుసుకోవచ్చు. ఒకవేళ హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య వచ్చిందంటే ఒకవైపు అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటూనే అదేసమయంలో లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ పద్ధతిని ఆశ్రయించవచ్చు. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ అనేది సురక్షితమైన పద్ధతి.

అయితే లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా వెంట్రుకలను ఒక్కసారి తొలగించుకునే వీలుండదు. ప్రతి సెషన్‌లో 20 నుంచి 30 శాతం హెయిర్‌ పోతుంటుంది. అలా పలు సెషన్లు చేయించుకున్న తర్వాత దట్టంగా ఉన్న హెయిర్‌ కాస్తా పలుచగా మారుతుంటుంది. అలాగే హెయిర్‌ మొత్తం పోయి షేవ్‌ చేసినట్టుగా మారే అవకాశం ఉండదు. సెషన్స్‌ అన్నీ అయిపోతే బేబీ హెయిర్‌లాగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు.

ఇక అవాంఛిత రోమాలు తొలగించుకోడానికి ఉన్న మరొక పద్ధతి ఎలక్ట్రాలసిస్. ఈ పద్ధతిలో ఎలక్ట్రిక్‌ కరెంట్‌ను సన్నటి వైర్‌ ద్వారా వెంట్రుక మొదట్లోకి చొప్పిస్తుంటారు. దాంతో ఆ వెంట్రుక నశిస్తుంది. కానీ, దీని ద్వారా నొప్పి ఉండడంతో పాటు చర్మ రంధ్రాలు వాపుకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ అనేది సురక్షితమైన పద్ధతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్