పాలు తాగుతుంటే తేన్పులు.. ఎందుకిలా?

మా పాప వయసు 25 రోజులు. పాప పాలు తాగుతుంటే తేన్పులు వస్తున్నాయి. వారంలో మూడు రోజులు ఇలా జరుగుతోంది. దీనివల్ల పాప పాలు సరిగ్గా తాగలేక, ఆకలికి ఏడుస్తోంది.

Published : 07 Jun 2024 14:33 IST

మా పాప వయసు 25 రోజులు. పాప పాలు తాగుతుంటే తేన్పులు వస్తున్నాయి. వారంలో మూడు రోజులు ఇలా జరుగుతోంది. దీనివల్ల పాప పాలు సరిగ్గా తాగలేక, ఆకలికి ఏడుస్తోంది. పాప పుట్టిన మొదటి 10 రోజుల్లో ఇలాంటి సమస్య లేదు. కడుపు నిండా పాలు తాగి బాగా నిద్రపోయేది. ఇప్పుడు పాప పొట్టలో అంత గ్యాస్‌ ఎలా చేరిందో అర్థం కావడం లేదు. ఇది సాధారణమేనా? లేక డాక్టర్‌ను సంప్రదించాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పిల్లలు మొదటి ఆరు నెలలు తల్లి పాల మీదే ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో తల్లికి పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయి. ఇలాంటప్పుడు పిల్లలు కూడా గబాగబా పాలు తాగుతుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లి ఆహారంలో లోపం ఉన్నట్లయితే పాలు తక్కువగా వస్తుంటాయి. ఇలాంటప్పుడు పాలు సరిపోక ఖాళీ రొమ్మునే సక్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువ గాలి పొట్టలోకి చేరుతుంది. మరికొన్ని సందర్భాల్లో పాపాయిని బుజ్జగించడానికి తేనె పీకను ఉపయోగిస్తుంటారు. ఈ పీక పెట్టినప్పుడు కూడా గాలిని మింగుతుంటారు. మీ పాప విషయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయోమే పరిశీలించుకోండి. ఇలా పొట్టలో గ్యాస్‌ ఎక్కువైనప్పుడు తేన్పుల ద్వారా గాలి బయటకు వెళుతుంది. దీనివల్ల బేబీకి కాస్త ఉపశమనం కలుగుతుంది. అయితే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు పాపను ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టడం లేదా భుజం మీద వేసుకొని బర్పింగ్‌ చేయడం.. వంటి పద్ధతులు పాటించాలి. ఫలితంగా గాలి బయటికి వెళ్లిపోతుంది.

అప్పటికీ సమస్య తగ్గుముఖం పట్టకపోతే.. తల్లి తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉండడం.. బాగా ఉడికించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం.. వంటివి చేయాలి. అలాగే నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుండాలి. ఈ జాగ్రత్తలన్నీ తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అలాగే రొమ్ములో పాలు ఎక్కువగా ఉత్పత్తయ్యేందుకు తోడ్పడతాయి. తద్వారా పాపాయి కడుపునిండా పాలు తాగడం వల్ల పొట్టలో గ్యాస్‌ చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ పాప ఎక్కువగా ఏడవడం, బరువు తగ్గడం లేదా బరువు పెరగకపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్