Updated : 19/01/2023 06:04 IST

మనసు మాట విన్నా!

సాయంత్రమైతే అమ్మాయిని గడప దాటనివ్వని ఊరు మాది. ఇంజినీరింగ్‌ చేస్తానంటే ఊరుకుంటారా? ‘అమ్మాయిలకు పెద్ద చదువులు అనవసరం’ అన్నారు. పెళ్లి సంబంధాలు చూస్తోంటే.. భయపడి ఇంటి నుంచి పారిపోయా. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, స్నేహితుల సాయంతో చదువుకున్నా. అనుకోకుండా ఆసక్తి కలిగి, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పుస్తకాలు చదివా. ఆ పరిజ్ఞానంతో నేను పని చేసే చోట అందరికీ సలహాలిచ్చేదాన్ని. అవి అందరికీ నచ్చేవి. ఒకరి సలహాతో ఉద్యోగం వదిలి సొంతంగా బొటిక్‌ ప్రారంభించా. అది విజయవంతమయ్యాకే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా. ఇక వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోల్లో పాల్గొనే స్థాయికి ఎదిగా. ప్యారిస్‌ ఫ్యాషన్‌ షోలో మెరిసిన తొలి భారతీయ మహిళగా నిలిచా. విన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది? కానీ ఆ క్రమంలో ఎన్నో ఆటంకాలు, ఎదురు దెబ్బలు. పక్కన నా అన్నవాళ్లు లేరు. ఆత్మీయుల అండ లేదు. ఒంటరి అమ్మాయిని. తిండి పెట్టే ఆ చిన్ని ఉద్యోగాన్ని వదలడానికి ఎంత ధైర్యం కావాలి! అయినా ముందడుగేశా. ఎవరో చెప్పారని కాదు. ఫ్యాషన్‌ డిజైనింగే నాకు సరైనదని నా మనసు చెప్పింది. నిరూపించుకోగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది. అందుకే ఎందరు వారించినా, నిరుత్సాహపరచినా నా నిర్ణయానికే కట్టుబడి ఉన్నా. మనకు ఏది సరైనదో చెప్పడానికి ఎవరో అవసరం లేదు. మన మనసు చాలు. దాన్ని అనుసరించి చూడండి.. ఎలా సాగాలో మనకే తెలుస్తుంది. అవకాశాలూ కనిపిస్తాయి. వాటిని అందిపుచ్చుకుంటే విజయమే మన దగ్గరికి వస్తుంది. బలవంతంగా చేసే పనిలో దూసుకెళ్లడం ఉండదు. ఆధారపడటమే ఉంటుంది. కాబట్టి.. నచ్చిందేదో తెలుసుకోండి.. ఆ పనే చేయమనేది నా సలహా!

-వైశాలి షాదంగుల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి