రొమ్ము క్యాన్సర్‌ని తగ్గించే ఆహారం!

మనకు ప్రధాన ఉపద్రవాల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఒకటి. ఈ ముప్పు తప్పించుకోవాలంటే జీవనశైలి మార్పులతో పాటూ... ఆహారం విషయంలోనూ జాగ్రతలు తీసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి-వెల్లుల్లిలోని ఫ్ల్లేవనాయిడ్లు ప్రభావ వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.

Updated : 31 Dec 2022 01:08 IST

మనకు ప్రధాన ఉపద్రవాల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఒకటి. ఈ ముప్పు తప్పించుకోవాలంటే జీవనశైలి మార్పులతో పాటూ... ఆహారం విషయంలోనూ జాగ్రతలు తీసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు.

ల్లి-వెల్లుల్లిలోని ఫ్ల్లేవనాయిడ్లు ప్రభావ వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి రక్తశుద్ధిలోనూ, శరీరంలోని విష వ్యర్థాలను తొలగించడంలోనూ సాయపడతాయి. క్యాన్సర్‌ నిరోధకంగానూ పనిచేస్తాయి.

చేపలు: సముద్ర చేపలైన సాల్మన్‌, సార్డిన్స్‌ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. బరువునీ అదుపులో ఉంచుతాయి.

పసుపు: ఇందులోని కర్క్యుమిన్‌ రొమ్ము క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోగలవని అధ్యయనాలు  చెబుతున్నాయి. అందుకే క్రమం తప్పక దాన్నీ ఆహారంలో మితంగా తీసుకోవాలి.

నిమ్మ జాతి పండ్లు:  సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సి, కెరొటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్