సరదాగా చేద్దామా శ్రమ!

చాలామంది మహిళలు వ్యాయామం చేయాలని అనుకుంటారు. కానీ...ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. బయటకి వెళ్లడం కుదరదు. ఇలాంటివారు సులువుగా వాడగలిగే వ్యాయామ సాధనం హులాహూప్‌ సరదాగానూ ఉంటుంది.

Published : 31 Oct 2022 00:15 IST

చాలామంది మహిళలు వ్యాయామం చేయాలని అనుకుంటారు. కానీ...ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. బయటకి వెళ్లడం కుదరదు. ఇలాంటివారు సులువుగా వాడగలిగే వ్యాయామ సాధనం హులాహూప్‌ సరదాగానూ ఉంటుంది. శారీరక శ్రమనూ ఇస్తుంది. రోజూ కాసేపు చేయడం ప్రయత్నిస్తే శరీరమూ అలవాటు పడుతుంది.

* హులా హూప్‌ నిజానికి ఏరోబిక్స్‌లో ఓ భాగం. దీంతో సులువుగా కెలొరీలు తగ్గించుకోవచ్చు. శరీరం మొత్తానికి వ్యాయామం అందించే ఈ సాధనం వల్ల చురుగ్గా ఉండొచ్చు. రక్తపస్రరణలో లోపాలు తగ్గుతాయి.

* కొవ్వు ఎక్కువగా చేరే శరీర భాగాలు నడుమూ, పిరుదులే. ఇక్కడి కొవ్వు త్వరగా కరగాలంటే... మాత్రం హులాహూప్‌ చక్కని ఎంపిక. నలుగురైదు కలిసి ఓ మంచి పాటకు అనుగుణంగా నృత్యం కలిపి వ్యాయామం చేస్తే సరదగానూ ఉంటుంది.

* ఈ రింగుతో వ్యాయాయం చేయడం వల్ల గుండె, వెన్ను ఆరోగ్యం బలపడతుంది. ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. బరువూ సులువుగా తగ్గొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్