నడవ లేకపోతుంటే... ఉత్తాన పాదాసనం

మనలో చాలామంది ఎక్కువసేపు నిలబడి పనిచేసేవాళ్లే ఉంటారు. ఈ క్రమంలో గుండె నుంచి శరీర అవయవాలకు రక్తప్రసరణ జరుగుతుంది. కానీ దీనివల్ల గుండె జీవితకాలం తగ్గే ప్రమాదం ఉందట.

Updated : 06 Apr 2024 04:58 IST

మనలో చాలామంది ఎక్కువసేపు నిలబడి పనిచేసేవాళ్లే ఉంటారు. ఈ క్రమంలో గుండె నుంచి శరీర అవయవాలకు రక్తప్రసరణ జరుగుతుంది. కానీ దీనివల్ల గుండె జీవితకాలం తగ్గే ప్రమాదం ఉందట. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పాదాల నుంచి గుండెకు అంటే రివర్స్‌ సర్క్యులేషన్‌ కూడా అంతే ముఖ్యమట. కాబట్టి ఎక్కువసేపు నిలబడి, కూర్చుని ఉండే వారికి ఉత్తాన పాదాసనం ఎంతో మేలు చేస్తుంది. కాళ్లవాపులు, నొప్పులు, నీరుపట్టడం, వేరికోజ్‌వీన్స్‌, థైరాయిడ్‌... వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా నడవలేని పెద్దవాళ్లు ఈ ఆసనం వేయడంవల్ల రక్తప్రసరణ బాగా జరిగి నడవగలుగుతారు. పాదాల నుంచి గుండెకు రక్తప్రసరణ జరగడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

చేసే విధానం.. దీన్ని నేల, మంచం మీద ఎక్కడైనా చేయవచ్చు. ఫొటోలో చూపిన విధంగా కాళ్లనూ, పాదాల వేళ్లనూ గోడకు నిటారుగా పైకి పెట్టి ఉంచాలి. రెండు చేతులనూ ఫొటోలో చూపిన విధంగా నేలకు సమాంతరంగా ఉంచాలి. పదిహేను నిమిషాలు కళ్లు మూసుకుని రోజూ చేస్తే ఉపశమనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్