అమ్మ త్యాగం వృథా పోలేదు!

హిందూ స్త్రీలు మంగళసూత్రాన్ని. పరమ పవిత్రంగా భావిస్తారు. దాన్ని బంగారంగా కాదు భర్తకు ప్రతిరూపంగా, దాంపత్యానికి ప్రతీకగా చూస్తారు. దాన్ని మెళ్లోంచి కాసేపు తీయడానికే వెనకాడతారు. అలాంటి మంగళ సూత్రాలను అమెరికాలో చదువుకోవాలనుకున్న కూతురి కల నెరవేర్చేందుకు తాకట్టుపెట్టిందామె. ఆమె ఎవరో, ఫలితం ఏమైందో చూద్దాం..

Updated : 28 Jun 2022 03:35 IST

హిందూ స్త్రీలు మంగళసూత్రాన్ని. పరమ పవిత్రంగా భావిస్తారు. దాన్ని బంగారంగా కాదు భర్తకు ప్రతిరూపంగా, దాంపత్యానికి ప్రతీకగా చూస్తారు. దాన్ని మెళ్లోంచి కాసేపు తీయడానికే వెనకాడతారు. అలాంటి మంగళ సూత్రాలను అమెరికాలో చదువుకోవాలనుకున్న కూతురి కల నెరవేర్చేందుకు తాకట్టుపెట్టిందామె. ఆమె ఎవరో, ఫలితం ఏమైందో చూద్దాం..

ముంబయిలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది సాక్షి రాంభియా. ఓ చిన్న గదిలో అమ్మానాన్నా, నాన్నమ్మ, తాతయ్యలతో నివాసం. ఇంటి పరిస్థితులు ఆమెని బెంగటిల్ల చేస్తే చదువు ఉత్సాహపరిచేది. స్కూల్లో లైబ్రరీకి వెళ్లి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పుస్తకాలను చదివేది. అలాంటి విశ్వ విద్యాలయాలకు వెళ్లాలనుకునేది.

ఇంటర్‌ చదువుతుండగా స్కాలర్‌షిప్‌తో బాటు అప్లయ్‌డ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో మూడు వారాల ప్రోగ్రాంకు ఆహ్వానం అందుకుంది. అప్పుడు గానీ ఇంట్లో అర్థం కాలేదు, ఆమెకి చదువంటే ప్రాణమని. ఆ వయసులోనే నాన్నమ్మ తాతయ్యల కోసం మాటలను అక్షరాల్లోకి తర్జుమా చేసే (స్పీచ్‌ టు టెక్ట్స్‌) మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. 90కి పైగా భాషలకు దాన్ని వర్తింప చేసింది. ఆ ధైర్యంతోనే కంప్యూటర్‌ సైన్సును ఎంచుకుంది.

ఇంటర్‌ అయిపోయాక తనకు అమెరికా వెళ్లాలనే కోరిక బలపడింది. అందుకోసం చాట్‌బోట్స్‌, వెబ్‌సైట్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌.. ఇలా ఫ్రీలాన్సర్‌గా అనేకం చేసింది. ఆ డబ్బు చాలక పోయే సరికి కూతురి కోసం మంగళసూత్రాలను తాకటు ్టపెట్టింది సాక్షి వాళ్ల అమ్మ. అదృష్టవశాత్తూ అమెరికాలో దూరపు బంధువు ఉండటాన న్యూయార్క్‌ వెళ్లడం కొంత సులువైంది. వసతి కోసం అదనపు ఖర్చవుతుందని న్యూయార్క్‌లో ఉన్న కాలేజీనే ఎంపిక చేసుకుంది. తొలి సంవత్సరం విద్యార్థులు పని చేయకూడదనే నియమం ఉంది. అందువల్ల తను పేద విద్యార్థుల కోసం ‘స్టెమ్‌’ సమన్వయ కార్యక్రమాల్లో వాలంటీర్‌గా పనిచేసేది. అది సాక్షికి ఆర్థిక లబ్ధినే గాక మంచిపేరు తెచ్చిపెట్టింది. ఐకరాజ్యసమితితో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు, అంతర్జాతీయ ప్రముఖులను కలవగలిగింది.

‘ఇతర దేశాల వారికి ఇక్కడ క్యాంపస్‌ ఉద్యోగాలు దొరకడం మహా కష్టం. కానీ నెట్‌వర్క్‌ పెంచుకోవడం వల్ల నాకు 3 క్యాంపస్‌ ఉద్యోగాలు వచ్చాయి. స్కాలర్‌షిప్పులకూ ఎంపికయ్యా. అలా రెండో సంవత్సరం ట్యూషన్‌ ఫీజు, ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. మూడో సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌, టెస్లా, ఆడియన్స్‌ జీనోమిక్స్‌ లాంటి పెద్ద సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేశాను. వాటికోసమూ రెజ్యూమె రివ్యూలు, రాత పరీక్షలు, సుదీర్ఘ చర్చలు, ఫోన్‌ స్క్రీనింగు, ముఖాముఖి ఇంటర్వ్యూలు- అన్నీ దాటాలి. కాకపోతే వాలంటీర్‌గా చేయడం నాకు కలిసొచ్చింది. పై చదువులు చదవాలనుకునేవారికి స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్‌, ఇంటర్న్‌షిప్‌లు ఎంతో మేలు చేస్తాయి. చాలామంది అవగాహన లేక అవకాశాలను కోల్పోతుంటారు. అది చాలా బాధాకరం’ అంటున్న సాక్షి న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. గూగుల్‌లో అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిజైన్‌, ఇంజినీరింగ్‌, మార్కెటింగ్‌ ఇలా వివిధ విభాగాల్లో 45 మందికి అవకాశం కల్పిస్తే దానిలో సాక్షి ఒకరు. ఇపుడ[ు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పీజీ అవకాశాన్నీ దక్కించుకుంది. చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగొచ్చి సామాజిక ఆవిష్కరణలకు దోహదం చేసేలా కృషి చేస్తానంటోన్న ఈమె ఎందరికో స్ఫూర్తిగా నిలిస్తే, తన త్యాగం వృథా కాలేదని గర్విస్తోంది వాళ్ల అమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్