మొదటిసారి కలుస్తోంటే..

ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పెళ్లి చూపులకన్నా ముందే అబ్బాయిని కలిసి, మాట్లాడి తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారు.  మీదీ అదే కోవా? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి. దుస్తులు.. తొలి చూపులోనే మంచి అభిప్రాయం కలిగించడంలో ముఖ్యపాత్ర ఆహార్యానిది! అందుకని బాగా రెడీ అవ్వడంపై ఎక్కువ హైరానా పడకండి! సంప్రదాయ వస్త్రధారణ, పద్ధతిగా కనిపించాలంటూ...

Published : 24 Sep 2022 00:43 IST

ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పెళ్లి చూపులకన్నా ముందే అబ్బాయిని కలిసి, మాట్లాడి తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారు.  మీదీ అదే కోవా? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి.

దుస్తులు.. తొలి చూపులోనే మంచి అభిప్రాయం కలిగించడంలో ముఖ్యపాత్ర ఆహార్యానిది! అందుకని బాగా రెడీ అవ్వడంపై ఎక్కువ హైరానా పడకండి! సంప్రదాయ వస్త్రధారణ, పద్ధతిగా కనిపించాలంటూ కంగారూ వద్దు. నీట్‌గా కనిపిస్తే చాలు. కాబట్టి, అనవసర ఖర్చు వద్దు. మీకు సౌకర్యంగా ఉండే వస్త్రాలతో, సింపుల్‌గానే వెళ్లండి.

మేకప్‌.. ముఖం మీద మచ్చలా? కళ్ల కింద నలుపా? వాటిని దాచే ప్రయత్నం చేస్తున్నారా! అంటే మిమ్మల్ని మీరే అంగీకరించడం లేదనే! ఇప్పుడంటే దాస్తారు. ఎన్నాళ్లు అలా! మీ రూపమే అవతలి వాళ్లు అంగీకరించడానికి కారణమైతే... భవిష్యత్తులో అదే ఇబ్బందుల్నీ తెచ్చిపెట్టగలదు. కాబట్టి, మీరు మీలానే కనిపించండి.

భయమొద్దు.. ఆ అబ్బాయితో జీవితాంతం నడవగలరా అనేది చెక్‌ చేసుకోవడానికి వెళుతున్నారు. వాళ్లని మెప్పించాలనో, మెప్పించలేనేమో అన్న భయం, ఆందోళన వద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా తెలియజేయండి.

అప్పుడే అనవసరం.. ఉద్యోగ వివరాలు, బాధ్యతలు, ఇంకా కావాలంటే జీతం వరకూ చెప్పొచ్చు. అంతకుమించి వివరాలను చర్చించక్కర్లేదు. పెళ్లయ్యాకా ఉండే వ్యక్తిగత బాధ్యతలు వగైరా చెబితే చాలు. మీ పెట్టుబడులు, వ్యక్తిగత వివరాలను చెబుతూ వెళ్లొద్దు. అభిప్రాయాలు కలిశాయి అన్నాక మిగతావి చర్చించొచ్చు. మొత్తంగా వారిని ఇంప్రెస్‌ చేయాలన్న కంగారొద్దు. చివరివరకూ మీరు మీలాగే ఉండండి. అప్పుడే నిజాయతీతో కూడిన బంధంలోకి వెళ్లగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్