కలిసి చదివారు.. కలిసి సాధించారు!

చిన్ననాటి స్నేహాన్ని జీవితాంతం కొనసాగించే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఈ స్నేహితులది మాత్రం ప్రత్యేక పంథా.. స్కూలు, ఉన్నత చదువులు దాటి ...

Updated : 30 Sep 2022 02:49 IST

చిన్ననాటి స్నేహాన్ని జీవితాంతం కొనసాగించే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఈ స్నేహితులది మాత్రం ప్రత్యేక పంథా.. స్కూలు, ఉన్నత చదువులు దాటి ... ఇప్పుడు ర్యాంకులనూ కలిసే సాధించారు.

సోనమ్‌ అగర్వాల్‌, ప్రాచీ కర్ణానీ, రిధిమా అగర్వాల్‌.. ముగ్గురిదీ సూరత్‌. ప్రైమరీ స్కూల్లో స్నేహితులయ్యారు. తర్వాతా ఒకే విద్యా సంస్థల్లో కొనసాగారు. కలిసే కోర్సులు ఎంచుకున్నారు. తాజాగా సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ) ఫైనల్‌ పరీక్షలు రాశారు. ఆ ఫలితాల్లో సోనమ్‌ అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు... ప్రాచీ 4, రిధిమ 5 ర్యాంకులు సాధించారు. ‘చిన్నప్పటి నుంచీ మీరు అక్కాచెల్లెళ్లా అని అడిగేవారందరూ. అంతకన్నా ఎక్కువే అని చెబుతాం. ఏ పరీక్షలైనా కలిసే సిద్ధమయ్యే వాళ్లం. ప్రతి విషయంలోనూ ఒకరికొకరం సంప్రదించుకుని నిర్ణయించుకుంటాం. సీఎంఏ విషయంలోనూ అదే కొనసాగించాం. చదువుల్లో ఒకరికొకరం సాయం చేసుకున్నాం. మంచి మార్కులు వస్తాయనుకున్నాం కానీ.. జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తామని అనుకోలేదు’ అంటున్నారీ మిత్రులు. సోనమ్‌, రిధిమ ఇప్పటికే సీఏ కోర్సు పూర్తిచేశారు. ప్రాచీ సీఏ ఫైనల్‌కు సిద్ధమవుతోంది. ఉద్యోగాల విషయంలోనూ ముగ్గురూ ఒకే కార్పొరేట్‌ సంస్థకు వెళతామంటున్నారు. బాగుంది కదూ వీళ్ల స్నేహం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్