మనల్ని మనం నమ్మాలి..

చిన్నప్పటి నుంచి సన్నగా ఉంటానని అందరూ హేళన చేసే వారు. నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టి, నాపై నేను నమ్మకాన్ని తెచ్చుకోవడం నేర్చుకున్నా.

Published : 07 Oct 2022 00:15 IST

- హర్నాజ్‌కౌర్‌ సంధు, మిస్‌ యూనివర్స్‌, 2021

చిన్నప్పటి నుంచి సన్నగా ఉంటానని అందరూ హేళన చేసే వారు. నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టి, నాపై నేను నమ్మకాన్ని తెచ్చుకోవడం నేర్చుకున్నా. దీనికి అమ్మే.. కారణం. తను పితృస్వామ్య వ్యవస్థపై పోరాడి గెలిచింది. గైనకాలజిస్ట్‌గా పని చేస్తూనే, మహిళలకు ఇతరత్రా సేవలందించడానికీ ఉత్సాహంగా ముందుకెళ్లేది. మహిళారోగ్యంపై చైతన్య కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేసేది. స్కూల్‌ విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి నేను కూడా తనతో వెళ్లేదాన్ని. అప్పుడే నెలసరిలో ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన తెచ్చుకోగలిగా. నెలసరి కారణంగా గ్రామీణ, పేద విద్యార్థినులు చదువు మానేయడం వంటి ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఎలా సాధించాలో అమ్మ నుంచే నేర్చుకున్నా. హేళన చేసే వారి అభిప్రాయాలకు తగ్గట్లు మనం ఉండకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు మనమేంటో మనమే మర్చిపోతాం. ఈతరం ఎదుర్కొనే సమస్య కూడా ఇదే. మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. అందరిలోనూ మీరే ప్రత్యేకమవుతారు. ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడటానికి ఎన్నో విషయాలున్నాయి. అలాగే మీ గురించి కూడా మీరే మాట్లాడాలి. ఎందుకంటే మీ జీవితానికి మీరే నాయకులు. నన్ను నేను మెచ్చుకునేలా ఉండటానికి ప్రయత్నిస్తుంటా. మనల్ని మనం నమ్మితే, ప్రపంచంలో దేన్నైనా సాధించొచ్చు. నేను అందాల కిరీటాన్ని దక్కించుకోగలనని గట్టిగా నమ్మాను, సాధించాను. నాలో ఈ మార్పు రావడానికి అమ్మే కారణం. తనే నాకు స్ఫూర్తి. నేను కలలు కనేలా చేసి, వాటిని సాధించడానికి తాను నిచ్చెనలా నిలబడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్