కెరియర్‌లో మహరాణులుగా నిలపాలని!

పెళ్లయ్యేవరకూ బానే ఉండే అమ్మాయిల కెరియర్‌.. ఆ తర్వాత సాఫీగా సాగదు. కుటుంబం, పిల్లలు.. పెరిగే బాధ్యతలతో అది పక్కకెళ్లిపోతుంది. దీన్ని గమనించింది నేహా.  ఈ సమస్యకు స్నేహితురాళ్లతో కలిసి ఆమె చూపిన పరిష్కారం లక్షల మంది మహిళలకు సాయపడుతోంది. మధ్యతరగతి అమ్మాయి నేహా షా. వాళ్ల నాన్నకు కూతుర్ని అమెరికాలో చదివించాలని కోరిక.

Published : 08 Oct 2022 00:31 IST

పెళ్లయ్యేవరకూ బానే ఉండే అమ్మాయిల కెరియర్‌.. ఆ తర్వాత సాఫీగా సాగదు. కుటుంబం, పిల్లలు.. పెరిగే బాధ్యతలతో అది పక్కకెళ్లిపోతుంది. దీన్ని గమనించింది నేహా.  ఈ సమస్యకు స్నేహితురాళ్లతో కలిసి ఆమె చూపిన పరిష్కారం లక్షల మంది మహిళలకు సాయపడుతోంది.

ధ్యతరగతి అమ్మాయి నేహా షా. వాళ్ల నాన్నకు కూతుర్ని అమెరికాలో చదివించాలని కోరిక. అప్పటివరకూ వాళ్ల చుట్టపక్కాల్లో ఎవరూ విదేశాల్లో చదవలేదు. ఆడపిల్లని కనీసం పక్కూరికి పంపడానికీ ఆలోచించేవారు. అయినా ఆయన పట్టుబట్టి నేహను 16 ఏళ్ల వయసులోనే అమెరికా పంపారు. వీళ్లది ముంబయి. నాన్నది స్థిరాస్తి వ్యాపారం. అమెరికాలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది నేహా. అక్కడ చదివేటప్పుడు డబ్బులు సరిపోక ఇంటర్న్‌షిప్‌లు, చిన్నపాటి ఉద్యోగాలూ చేసేది. ట్యూషన్లు చెప్పేది. కొత్తగా విదేశాలకు వచ్చే వాళ్లు వసతికోసం ఇబ్బంది పడుతుండటం, మధ్యతరగతి వాళ్లు ఖర్చు భరించలేకపోవడం వంటివెన్నో గమనించింది. స్నేహితులతో కలిసి తక్కువ వ్యవధి లీజులతో ఇళ్లను అద్దెకిచ్చే వ్యాపారాన్ని ప్రారంభించింది. అందులో లాభాలతోపాటు ఎన్నో సవాళ్లూ ఎదుర్కొంది. ఇవన్నీ తనకు వ్యాపార అనుభవాన్నీ తెచ్చాయి.


రంగాలే కాదు.. ఇంట్లోనూ లింగ సమానత్వం ఉండాలి. తమ కాళ్లపై తాము నిలబడాలీ, ఆర్థిక స్వేచ్ఛ కావాలనుకునే మహిళలకు ఆ అవకాశం కల్పించడమే నా ధ్యేయం. రానున్న అయిదేళ్లలో కోటిమందికి కెరియర్‌లో సాయపడటమే నా లక్ష్యం.


2010లో దేశానికి తిరిగొచ్చింది. నాన్నకి చేదోడుగా నిలిచింది. మార్పులు చేసి కుటుంబ వ్యాపారాన్ని కార్పొరేట్‌ స్థాయికి తెచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి, పాపాయి పుట్టడం జరిగి పోయాయి. ఇరువైపుల కుటుంబాలూ చిన్నారిని చూసుకోవడంలో సాయపడ్డారు. అందువల్ల తనకు కెరియర్‌లో ఇబ్బందులేమీ రాలేదు. కానీ తన స్నేహితుల్లో చాలా మందికి అలాంటి అవకాశం లేకపోవడాన్ని గమనించింది నేహ. అందుకే స్నేహితులు నితీ జైన్‌, దేవల్‌ షాలతో కలిసి 2015లో ‘క్వీన్‌’ సంస్థని ప్రారంభించింది.
‘కొవిడ్‌ తర్వాత ఇంటి నుంచి పనిచేయడం సాధారణమైంది. కానీ మేం ప్రారంభించినప్పుడు అసలా ఆలోచనే తెలియదు. నేను తల్లయ్యాక స్నేహితులతో ఎప్పుడు మాట్లాడినా పిల్లలు పుట్టాక కెరియర్‌ మానేశామనో, ఇల్లు, ఉద్యోగం చూసుకోవడం ఇబ్బందిగా ఉందనో చెప్పేవారు. అలాంటి వాళ్లకు సాయమందించాలని ‘క్వీన్‌’ ప్రారంభించాం. దీని ద్వారా నచ్చిన వేళల్లో ఉద్యోగం చేసుకునేలా పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌, ప్రాజెక్టులను బట్టి వీలైనపుడు పని చేసుకునే సౌకర్యాన్ని కల్పించాం. కెరియర్‌ గ్యాప్‌ వచ్చిన వారి కోసం కోర్సులనీ చేర్చాం. దీనికోసం అమెజాన్‌, జెన్‌పాక్‌, బైజూస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి వందల సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. తగిన ఉద్యోగులను ఎంచుకున్నాక సంస్థల నుంచే కొంత మొత్తం తీసుకుంటాం. కొన్ని పెయిడ్‌ ప్రోగ్రామ్‌లనూ ప్రారంభించాం. ఇప్పటి వరకూ 3 లక్షలకు పైగా మహిళలు మా వల్ల లాభపడ్డారు. అన్నట్టూ మాది పూర్తిగా మహిళలే నిర్వహించే సంస్థ. ఫ్రీలాన్సింగ్‌ అవకాశాలనూ ఇస్తున్నాం’ అని సంతోషంగా చెబుతుంది నేహా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్