Published : 26/10/2022 00:15 IST

విదేశాలకు.. ఆ కాఫీ ఘుమఘుమలు

ఇంట్లో చిన్నప్పుడు రుచిచూసిన ఆ కాఫీ పరిమళాన్ని పెద్దయ్యాక కూడా మరిచిపోలేదామె. ఆ రుచిని అందరికీ పంచడంతోపాటు.. స్థానిక రైతులకూ ఉపాధి కల్పించింది.  వ్యాపారాన్ని ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఉత్తమ వ్యాపారవేత్తగా పురస్కారాన్ని అందుకున్న దాసుమర్లిన్‌ మజావ్‌ స్ఫూర్తి కథనమిది..

సొంతంగా పండించిన కాఫీ గింజలతో... రోజూ అమ్మ ఇచ్చే కాఫీని ఇష్టంగా తాగేది దాసుమర్లిన్‌ మజావ్‌. రోజంతా ఆ రుచి ఆమెని వెంటాడేది. మేఘాలయలోని తిర్నా గ్రామంలో కాఫీ గింజలు పండించే రైతు కుటుంబంలో పుట్టిందామె. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నార్త్‌ ఈస్ట్‌ హిల్‌ విశ్వవిద్యాలయం(ఎన్‌ఈహెచ్‌యూ)లో బయోకెమిస్ట్రీలో మాస్టర్స్‌ చేసిన దాసుమర్లిన్‌, ఆ తర్వాత అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌లో చేరింది. పీహెచ్‌డీ పూర్తి చేసింది. సెలవుల్లో సొంతూరుకెళ్లినప్పుడు ఒక మార్పు గమనించింది. గతంలో కాఫీ తాగేవారంతా టీ తీసుకోవడం చూసింది. కాఫీ గింజలను పండించే తమ ప్రాంతంలోనే ఇలా కాఫీపై ఆసక్తి తగ్గడంపై దాసుమర్లిన్‌ను ఆలోచనలో పడేసింది.

రుచిని అందించి...

‘కాఫీ మానేసిన వారిని కారణమడిగితే గతంలో ఉన్న రుచి ఇప్పుడు లేద’నేవారు. దాంతో ఆ రుచిని అందరికీ తిరిగి అందరికీ గుర్తు చేయాలనిపించింది. అప్పుడే 2009లో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ కాఫీషాప్‌ ప్రారంభించా. అయితే నేననుకున్నట్లుగా కాఫీషాప్‌ నిర్వహించలేకపోయా. మా కుటుంబంలో వ్యాపారరంగంలో అడుగుపెట్టిన మొదటి మహిళను కావడంతో అనుభవం లేక ఇలా జరుగుతుందని అమ్మానాన్న భయపడ్డారు.

నేను ప్రత్యేకంగా చేసిన కాఫీ పొడితో స్నేహితులు, బంధువులకు కాఫీ చేసిచ్చి రుచి ఎలా ఉందో అడిగేదాన్ని. అందరూ ఆ రుచి బాగుందని చెప్పడంతో బ్యాంకులో రూ.3లక్షల రుణాన్ని తీసుకొని పెద్ద మొత్తంలో కాఫీపొడి తయారీ ప్రారంభించా. అలా 2016లో రెండోసారి ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ కాఫీ షాపు తెరిచి ‘స్మోకీ ఫాల్స్‌ ట్రైబ్‌ కాఫీ’ అని పేరు పెట్టా. ‘గింజల ఎంపికతోపాటు సరైన వేడిలో వేయించి పొడిచేయడానికి ప్రత్యేకంగా జర్మన్‌ కాఫీ రోస్టర్‌ తీసుకొన్నా. ఈ పొడితో చేసే కాఫీ రుచికి అభిమానులు పెరిగారు. కాఫీ పంట గురించి అవగాహన ఉన్న నాన్న సాయంతో స్థానిక రైతులను కలిసి వర్క్‌షాపులు నిర్వహించేవాళ్లం. నాణ్యమైన కాఫీ విత్తనాలు అందించి సేద్యమెలా చేయాలో మెలకువలు చెప్పేదాన్ని.  బెంగళూరు, ముంబయి, చెన్నై, గువాహతి తదితర నగరాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలకూ.. ఎగుమతి చేస్తున్నాం. ఏటా 7 టన్నుల కాఫీపొడిని విక్రయిస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 300మందికి పైగా రైతులు మాతో కలిసి పనిచేస్తున్నారు. 2019లో ‘మేఘాలయ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డును ఆ రాష్ట్రముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి