Published : 08/11/2022 00:19 IST

కాలం నొప్పిని మాయం చేస్తుంది

అనుభవ పాఠాలు

ఆ జనరల్‌ కంపార్టుమెంటులో తోటి ప్రయాణికులెవరూ సాయానికి రాకపోయినా.. నాకోసం నేను పోరాడాలనుకున్నా. దుండగులు నలుగురైదుగురు ఉన్నా తిరగబడ్డా. తీవ్రంగా ప్రతిఘటించే సరికి వేగంగా వెళుతున్న రైలు నుంచి నన్ను బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో కాలిని కోల్పోయినా.. తిరిగి కోలుకున్నా. ఎంత నష్ట పోయావు అనేది పెద్ద విషయం కాదు. కాలం ఆ నొప్పిని మాయం చేస్తుంది. ఎప్పుడూ సమున్నత లక్ష్యాలను నిర్దేశించు కోవాలి. వాటిని చేరే వరకూ ఎక్కడా ఆగకూడదు. జాతీయస్థాయి ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ క్రీడాకారిణిగా ఎన్నో విజయాలను సాధించిన నేను, సైన్యంలో చేరి దేశసేవలో భాగస్వామినవ్వాలనుకున్నా. తీరా వైకల్యం తోడైంది. ఇలాంటప్పుడే నాకే ఇలా ఎందుకు జరిగింది అని కాక, సాధించాలనే ఆలోచనతో ముందడుగు వేయాలి. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాల్ని ఎక్కి అక్కడ మన జాతీయ పతాకాన్ని ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నిరుత్సాహ పరిచారందరూ. సాధించాక వాళ్లే అభిప్రాయాన్ని మార్చుకుంటారని అనుకున్నా. కుంగుబాటు, ఓటమి వంటి ఆలోచనలకు తావు లేకుండా పట్టుదల, కష్టపడేతత్వం ఉంటే చాలు. ఏ పరిస్థితినైనా దాటగలం.
- అరుణిమ సిన్హా, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగురాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి