మూలాల్ని మరవకూడదు..

‘సెకండ్‌ వస్తే చప్పట్లు కొడతారు, పొగుడుతారు. కానీ త్వరగా మరచిపోతారు.

Published : 27 Nov 2022 00:06 IST

అనుభవ పాఠం

‘సెకండ్‌ వస్తే చప్పట్లు కొడతారు, పొగుడుతారు. కానీ త్వరగా మరచిపోతారు. చరిత్రలో నిలవాలంటే మొదటి స్థానంలో నిలవాలి’... ఈ మాటే నాకు స్ఫూర్తి. నేను చాలా కాంస్య పతకాలు గెలిచాను! అవెన్ని సాధించినా సంతృప్తి కలిగేది కాదు. ఈ ఏడాది ఆసియన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలవడం నాకు చాలా సంతృప్తినిచ్చిన విషయం. ఇవన్నీ ఎలా ఉన్నా... నా లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణం. దానికోసమే నా మార్గాన్ని మార్చుకున్నా. అసోంలో చిన్న పల్లెటూరు మాది. అమ్మా నాన్న రెక్కల కష్టం మీదే ఇల్లు గడిచేది. పైగా ముగ్గురు అమ్మాయిలం. ఎవరెంత వారించినా నాన్న మాత్రం ఆటల్లో ప్రోత్సహించారు. అక్కల్లాగే మార్షల్‌ ఆర్ట్‌ను ఎంచుకున్నా. దీనికి ఒలింపిక్స్‌ అవకాశం లేదని తెలిశాక బాక్సింగ్‌కు మారా. లక్ష్యాన్ని చేరాలంటే కష్టపడాలిగా! అందుకే ఆ విషయంలో ఎప్పుడూ వెనకాడను. ఫలితమే తాజా బంగారు పతకం. ఎక్కడెన్ని పతకాలు గెలిచినా ఇంట్లో సాధారణ అమ్మాయినే! ఇంటి పనుల్లో, నాన్నకు పొలంలో సాయం చేస్తా. ‘ఇప్పుడు నీకో గుర్తింపు ఉంది. ఇంకా ఇవన్నీ చేస్తే ఎలా’ అంటారు చాలా మంది. నా ఉనికే ఇది. లక్ష్యమే కాదు.. ఎంత ఎదిగినా మూలాల్ని మరచిపోకూడదు. అప్పుడే.. విజయానికీ సార్థకత!

- లవ్లీనా బొర్గోహైన్‌, బాక్సర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్