దూసుకెళ్లడమే.. నా సూత్రం!

అమ్మాయిలకు భయమెక్కువ, రిస్క్‌ తీసుకోవడానికి ముందుకు రారు. వ్యాపారంలో ఓ స్థాయికొచ్చాకా ఈ మాట ఎన్నిసార్లు వినుంటానో! మా అమ్మానాన్నా ఇద్దరూ వైద్యులే. అందుకే ఆ రంగంపై నాకూ ఆసక్తి. అయితే నేను చదివింది మేనేజ్‌మెంట్‌.

Updated : 01 Dec 2022 06:02 IST

అమ్మాయిలకు భయమెక్కువ, రిస్క్‌ తీసుకోవడానికి ముందుకు రారు. వ్యాపారంలో ఓ స్థాయికొచ్చాకా ఈ మాట ఎన్నిసార్లు వినుంటానో! మా అమ్మానాన్నా ఇద్దరూ వైద్యులే. అందుకే ఆ రంగంపై నాకూ ఆసక్తి. అయితే నేను చదివింది మేనేజ్‌మెంట్‌. నాన్న ల్యాబ్‌ను నేను నడిపిస్తానన్నప్పుడు చాలామంది నుంచి ‘అమ్మాయివి నువ్వేం చేయగలవు?’ ‘పెళ్లయ్యి వెళ్లిపోతే తర్వాత పరిస్థితేంటి?’ వంటి ప్రశ్నలెన్నో! రిస్క్‌ తీసుకోవడానికి నేను సిద్ధమే.. కానీ దానికి అనుమతించింది ఎంతమంది? కాబట్టి.. నెపం ఆడవాళ్లమీద నెట్టేముందు..

* ఇంట్లో అబ్బాయిలను ‘పెద్ద కలలు కను’ ‘నీకెందుకు నువ్వు చెయ్‌.. నీ వెనుక మేమున్నాం’ అని ప్రోత్సహిస్తున్నట్లే అమ్మాయిల విషయంలోనూ చేస్తున్నారా?

* ఆడపిల్లల భవిష్యత్తుకు అంటే.. పెళ్లికోసం కట్నం, లేదా నగలు.. తనకు నచ్చింది చేయడానికీ అని ఎప్పుడైనా కొంత దాచారా? పోనీ ఏదైనా వ్యాపారం చేస్తాను అంటే నమ్మి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారా?

* ఇల్లు, పిల్లలకే మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే కెరియర్‌! బాధ్యతలన్నీ సమానంగా పంచుకుందాం.. నీకు నచ్చింది చేయమనే భర్తలెంతమంది?
ఒక అమ్మాయి ఎదగడానికి ఇన్ని అడ్డంకులున్నాక ‘రిస్క్‌’కి ఆస్కారమేది? అలాగని ఆగిపోనక్కర్లేదు. ఆఫీసు, ఇల్లు.. ఏదైనా చర్చ వస్తే.. ముందు ఎదుటివారు చెప్పేది పూర్తిగా విందామనో, అవకాశమిస్తే మాట్లాడదామనో ఆలోచించే ధోరణి మనది. ఏ విషయంలోనైనా సావధానంగా కొనసాగుదామనుకుంటాం. అందుకే మనకి ఏమీ తెలియదు అని అనుకునే వారే ఎక్కువ. అలా కాదు.. దూసుకెళ్లే ధోరణి అలవాటు చేసుకోండి. అప్పుడే నిరూపించుకోగలరు. నేను పాటించిన సూత్రమిదే!

- అమీరా షా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, మెట్రోపోలిస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్